శిల్పాశెట్టి కేసుని కోర్టులో ఉదహరించిన సమంత లాయిర్

By Surya Prakash  |  First Published Oct 26, 2021, 8:32 AM IST

 ఈ విషయాన్ని సమంత చాలా సీరియస్ గా తీసుకుంది. తనపై తప్పుడు ప్రచారం చేసి వీడియోలు పెట్టిన ఛానెల్స్ ని పర్మినెంట్ మూయించే విధంగా జడ్జిమెంట్ ఇవ్వాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు.


కొన్ని రోజుల క్రితమే నాగ చైతన్య , సమంత తాము విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఆ సమయంలో కొన్ని యూ ట్యూబ్ చానెల్స్ ఆమెకి ఇబ్బంది కలిగించేలా వీడియోస్ పెడుతూ తమ వ్యూస్ కోసం రచ్చ రచ్చ చేసారు. సమంత విడాకుల వెనుక అసలు కథేంటి ? అనే అర్దం వచ్చేటట్టుగా కొన్ని కథనాలను అప్ లోడ్ చేసారు. కొన్ని ఛానెల్స్ అయితే వ్యూస్ కోసం కక్కుర్తితో ..హద్దు దాటేసి సమంత మరొకరితో ఎఫైర్ పెట్టుకుందని కూడా వీడియోస్ పెట్టారు. ఈ నేపధ్యంలో సమంత కోర్టుకు ఎక్కారు. ఆమె తరుపున న్యాయవాది బాలాజీ ఆ యూట్యూబ్ ఛానెల్స్ పై కేసు పెట్టి వాదిస్తున్నారు. కుకట్ పల్లి లో న్యాయ స్థానంలో ఈ కేసుపై విచారణ జరుగుతోంది. 

సమంత పెర్సనల్ లైఫ్ అలాగే సినిమా లైఫ్ డిస్టర్బ్ అయ్యేలా వారు పెట్టిన ఛానెల్స్ పై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని బాలాజీ గట్టిగా వాదిస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూడాలని ఆయన న్యాయ స్థానాన్ని కోరారు. ఇక ఈ విషయాన్ని సమంత చాలా సీరియస్ గా తీసుకుంది. తనపై తప్పుడు ప్రచారం చేసి వీడియోలు పెట్టిన ఛానెల్స్ ని పర్మినెంట్ మూయించే విధంగా జడ్జిమెంట్ ఇవ్వాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు.

Latest Videos

Also read Bigg boss tamil 5:నా ఓటు ఆ కంటెస్టెంట్ కే మీరు కూడా సప్పోర్ట్ చేయండి.. రానా వైఫ్ మిహికా వీడియో వైరల్

 భావప్రకటనా స్వేచ్ఛకు కూడా కొన్ని పరిమితులున్నాయని.. సమంత-నాగచైతన్య విడాకులు మంజూరు కాకముందే వ్యక్తిగతంగా ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదని కోర్టు దృష్టికి తీసుకెళ్లడంతో కోర్ట్ విచారణ చేపట్టింది.  సోమవారం నాడు సమంత దాఖలు చేసిన పిటిషన్ పై మరోసారి వాదనలు జరిగాయి. సమంత ప్రతిష్టను దెబ్బతీసిన మూడు యూట్యూబ్ ఛానెల్స్ పై చర్యలు తీసుకోవాలని ఆమె తరఫు న్యాయవాది కోర్టుని కోరారు. 

Also read బస్సు డ్రైవర్ పై రజనీ కామెంట్స్.. మాసిన చొక్కా, ఆ గతి కూడా లేదు.. డైలాగులు కాదు అక్షర సత్యాలు

సమాజంలో ఎంతో పేరు, ప్రఖ్యాతలు ఉన్న వ్యక్తిపై ఇలా ఆరోపణలు చేస్తూ.. తప్పుడు ప్రచారాలు చేయడం కరెక్ట్ కాదంటూ కోర్టుకి చెప్పారు. యూట్యూబ్ లింకులు మాత్రమే తొలగించాలని కోరుతున్నామని, భవిష్యత్‌లో ఇలాంటి వార్తలు రాయకుండా పర్మినెంట్ ఇంజెక్షన్ ఆర్డర్ ఇవ్వాలని కోరారు. ముంబై హైకోర్టులో శిల్పాశెట్టికి సంబంధించిన కేసులో ఇలానే ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చారని చెప్పారు. వాదనలు విన్న కూకట్ పల్లి కోర్టు తీర్పుని మంగళవారంకి రిజర్వ్ చేసింది. వాయిదా పడిన ఈ కేసులో న్యాయస్థానం నుండి ఎలాంటి తీర్పు వస్తుందో  యూ ట్యూబ్ చానెళ్ళపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. 
 

click me!