కంటెస్టెంట్ అక్షర రెడ్డికి ఓటు వేసి ఆమెను సపోర్ట్ చేయాలని మిహికా బజాజ్ ఇంస్టాగ్రామ్ లో వీడియో సందేశం విడుదల చేశారు .
తెలుగు తమిళ బాషలలో క్రేజీ షోగా ఉంది బిగ్ బాస్.Bigg boss telugu 5 ఏడు వారాలు పూర్తి చేసుకోవడం జరిగింది. హౌస్ లోకి ఎంటరైన కంటెస్టెంట్స్ లో 7గురు ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం హౌస్ లో 12మంది కొనసాగుతున్నారు. కాగా అక్టోబర్ 3న బిగ్ బాస్ తమిళ్ 5 ప్రారంభమైంది. హీరో కమల్ హాసన్ వరుసగా ఐదవ సీజన్ కి హోస్టింగ్ బాధ్యతలు తీసుకున్నారు. కాగా ఈ సీజన్లో లో పాల్గొన్న ఓ కంటెస్టెంట్ కి హీరో రానా వైఫ్ మిహికా బజాజ్ మద్దతుగా నిలిచారు.
కంటెస్టెంట్ అక్షర రెడ్డికి ఓటు వేసి ఆమెను సపోర్ట్ చేయాలని మిహికా బజాజ్ ఇంస్టాగ్రామ్ లో వీడియో సందేశం విడుదల చేశారు . బిగ్‌బాస్ తమిళ ఐదో సీజన్‌లో పాల్గొన్న నా బెస్ట్ ఫ్రెండ్ అక్షరకు అభినందనలు. నా ఓటు Akshara reddyకి, మీరు కూడా ఆమెకే ఓటు వేస్తారని భావిస్తున్నాను. ఎలాగైనా బిగ్‌బాస్ ట్రోఫీ సంపాదించుకుని వస్తావని ఆశిస్తున్నాను, ఆల్ ద బెస్ట్' అంటూ ఇంస్టాగ్రామ్ పోస్ట్ విడుదల చేశారు.
Also read బిగ్ బాస్ 5 నుంచి ప్రియా అవుట్.. ఇద్దరూ ఎలిమినేట్ అనుకున్నారు, కానీ..
రానా వైఫ్ Miheeka bajajస్వయంగా రంగంలోకి దిగి సపోర్ట్ చేస్తున్న ఈ అక్షర రెడ్డి ఎవరనే ఆసక్తి ప్రేక్షకుల్లో కలిగింది. ఇక అక్షర రెడ్డి విషయానికి వస్తే ఆమె ఒక మోడల్. 2019 మిస్ గ్లోబల్ అవార్డు దక్కించుకున్న అక్షర 'విల్లా టు విలేజ్' అనే ఓ టెలివిజన్ రియాలిటీ షో చేశారు. అలాగే కసు మేల కసు టైటిల్ తో తెరకెక్కిన మలేషియన్ చిత్రంలో నటించారు. రానా భార్యకు అక్షర బెస్ట్ ఫ్రెండ్ అని సమాచారం. Bigg boss tamil 5లో 18మంది కంటెస్టెంట్స్ పాల్గొనగా, వారిలో అక్షర రెడ్డి ఒకరు.
Also read నామినేషన్స్ కి భయపడేంత సీన్ లేదు..శ్రీరామ్ మాస్, షణ్ముఖ్ తల్లి గురించి సంచలన నిజం
ఇక 2020మే నెలలో మిహికా బజాజ్ తో రానా తన రిలేషన్షిప్ బయటపెట్టారు. మిహికా బజాజ్ తో తన వివాహం జరగనున్నట్లు వెల్లడించారు. ఆగష్టు 8వ తేదీన మిహికా- Rana వివాహం కోవిడ్ ఆంక్షల మధ్య అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగింది. హైదరాబాద్ కి చెందిన మిహికా బజాజ్ ని రానా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.