నాగచైతన్య అంత కట్నం తీసుకున్నాడా..?

Published : Jul 04, 2019, 04:44 PM IST
నాగచైతన్య అంత కట్నం తీసుకున్నాడా..?

సారాంశం

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం 'ఓ బేబీ'. 

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం 'ఓ బేబీ'. నందిని రెడ్డి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో సమంత బిజీగా గడుపుతోంది.

ప్రమోషన్స్ లో భాగంగా సోషల్ మీడియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న గంగవ్వతో కలిసి సరదాగా ముచ్చటించింది. ఈ క్రమంలో గంగవ్వ.. సమంతను, నందిని రెడ్డిని తన ప్రశ్నలతో ముప్పుతిప్పలు పెట్టింది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

'సినిమాల్లో వేరే వాళ్లు తాళి కడతారు కదా.. మీ భర్త ఏమీ అనరా..?' అని గంగవ్వ ప్రశ్నించగా.. అక్కడ రెండు ముళ్లు వేస్తారని.. మూడో ముడి వేయరని.. సమంత చెప్పింది. మీ భర్తను ఎంత పెట్టి కొనుక్కున్నారనే..? ప్రశ్నపై సమంత సరదాగా స్పందించింది.

కట్నమా..? చాలానే ఇచ్చా.. అది బయటకి చెప్పకూడదు అంటూ గంగవ్వ చెవిలో చెబుతుంది. అన్ని పైసలిచ్చి  కొన్నారా..? అని గంగవ్వ అడిగితే.. 'మరి అంత పెద్ద ఫ్యామిలీ కదా..!' అంటూ సమంత బదులిచ్చింది. 

 

PREV
click me!

Recommended Stories

Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌
రూ. 50 లక్షలతో తీస్తే రూ. 100 కోట్లు వచ్చింది.. దుమ్మురేపిన ఈ చిన్న సినిమా ఏంటో తెలుసా.?