కళ్యాణ్ రామ్ కొత్త చిత్రం.. టైటిల్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్!

Published : Jul 04, 2019, 04:42 PM IST
కళ్యాణ్ రామ్ కొత్త చిత్రం.. టైటిల్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్!

సారాంశం

118 చిత్రంలో కళ్యాణ్ రామ్ అవసరమైన హిట్ అందుకున్నాడు. వరుస పరాజయాలకు ఈ చిత్రం బ్రేక్ వేసింది. ఇకపై కథల ఎంపిక విషయంలో జాగ్రత్త వహించాలని కళ్యాణ్ రామ్ భావిస్తున్నాడు.

118 చిత్రంలో కళ్యాణ్ రామ్ అవసరమైన హిట్ అందుకున్నాడు. వరుస పరాజయాలకు ఈ చిత్రం బ్రేక్ వేసింది. ఇకపై కథల ఎంపిక విషయంలో జాగ్రత్త వహించాలని కళ్యాణ్ రామ్ భావిస్తున్నాడు. ప్రస్తుతం కళ్యాణ్ రామ్, కుటుంబ కథా చిత్రాల దర్శకుడు సతీష్ వేగేశ్న కాంబినేషన్ లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. 

ఈ చిత్ర టైటిల్ లోగోని రిలీజ్ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు.శుక్రవారం రోజు కళ్యాణ్ రామ్ పుట్టిన రోజు సందర్భంగా ఉదయం 8:30 గంటలకు టైటిల్ రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఆదిత్య మ్యూజిక్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. 

దర్శకుడు సతీష్ వేగేశ్న శతమానం భవతి చిత్రంతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. గత ఏడాది సతీష్ తెరకెక్కించిన శ్రీనివాస కళ్యాణం చిత్రం నిరాశపరిచింది. అచ్చ తెలుగు టైటిల్స్ కు ప్రాధానత్య ఇచ్చే సతీష్.. కళ్యాణ్ రామ్ చిత్రానికి ఎలాంటి టైటిల్ ఫిక్స్ చేశాడో అనే ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది. ఈ చిత్రం తర్వాత కళ్యాణ్ రామ్ సంపత్ నంది దర్శకత్వంలో మరో చిత్రంలో నటించనున్నాడు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: తనూజకి షాక్‌.. కళ్యాణ్‌ సీక్రెట్‌ క్రష్‌ బయటపెట్టిన ఇమ్మాన్యుయెల్‌
Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌