సమంత మేనేజర్‌ మోసం బట్టబయలు? కోటి రూపాయలకు స్కెచ్‌?

Published : Aug 31, 2023, 07:31 PM IST
సమంత మేనేజర్‌ మోసం బట్టబయలు? కోటి రూపాయలకు స్కెచ్‌?

సారాంశం

ఇప్పుడు సమంత మేనేజర్‌ కూడా మోసం చేశాడట. ఏకంగా కోటి రూపాయలు నొక్కేసేందుకు స్కెచ్‌ వేశాడట. తాజాగా ఈ వార్త హాట్‌ టాపిక్‌ గా మారింది.   

సమంత ఇప్పటికే కష్టాల్లో ఉంది. ఆమె నాగచైతన్య నుంచి విడాకులు తీసుకుని మానసికంగా కుంగిపోగా, ఆ సమయంలోనే మయోసైటిస్‌ వ్యాధిని ఆమెని మరింతగా కుంగదీసింది. బ్యాక్‌ టూ బ్యాక్‌ రెండు దెబ్బలతో కోలుకోలేకపోయింది. దాన్నుంచి నెమ్మదిగా బయటపడే ప్రయత్నం చేస్తుంది. అందుకోసం ఏకంగా సినిమాలు మానేసి రెస్ట్ తీసుకుంటుంది. ఈ క్రమంలో సమంతకి మరో షాక్‌ తగిలింది. తన మేనేజర్‌ రూపంలో దెబ్బ పడింది. మేనేజర్‌ ఆమెని మోసం చేశాడనే వార్త ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతుంది. 

హీరోలకు, హీరోయిన్లకి మేనేజర్లుంటారు. కాల్షీట్లు, రెమ్యూనరేషన్లు ఇలా అన్నీ మేనేజర్లే స్వయంగా చూసుకుంటారు. ఓ రకంగా మేనేజర్లు హీరోహీరోయిన్లకి దిశానిర్ధేశకులు. వారి చెప్పినట్టే స్టార్స్ వింటారు, ఫాలో అవుతుంటారు. అలాంటి మేనేజర్‌ మోసం చేస్తే చాలా దారుణంగా ఉంటుంది. ఆ మధ్య రష్మిక మందన్నా మేనేజర్‌ విషయంలో మోసపోయిందనే వార్త సంచలనంగా మారింది. ఇప్పుడు సమంత మేనేజర్‌ కూడా మోసం చేశాడట. ఏకంగా కోటి రూపాయలు నొక్కేసేందుకు స్కెచ్‌ వేశాడట. తాజాగా ఈ వార్త హాట్‌ టాపిక్‌ గా మారింది. 

ఆ వివరాల్లోకి వెళితే.. సమంత ప్రస్తుతం `ఖుషి` చిత్రంలో నటించింది. ఇది రేపు విడుదల కాబోతుంది. విజయ్‌ దేవరకొండ హీరోగా రూపొందిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. ఈ సినిమా షూటింగ్‌ సమయంలో సమంతకి మయోసైటిస్‌ వ్యాధి వచ్చిన విషయం తెలిసిందే. దీంతో రెండు మూడు నెలలు షూటింగ్‌కి గ్యాప్‌ ఇచ్చారు. పూర్తిగా ఆమె ఆసుపత్రిలోనే ఉన్నారు. అమెరికాలో చికిత్స తీసుకున్నారు. షూటింగ్‌ లో పాల్గొనే స్థితిలో లేరు. 

దీంతో `ఖుషి` సినిమా షూటింగ్‌ని ఆపేయాల్సి వచ్చింది. మూడు నాలుగు నెలలు షూటింగ్‌ ఆపేయడం నిర్మాతలకు పెద్ద భారమైన విషయం. సెట్‌ వర్క్ వేస్ట్ అవుతుంది. డేట్స్ వేస్ట్ అవుతుంటాయి. ప్రొడక్షన్‌ కాస్ట్ పెరుగుతుంది. వడ్డీలు మీద పడుతుంటాయి. ఈ నేపథ్యంలో తన వల్ల నిర్మాతలకు నష్టాలు రాకూడదని చెప్పి సమంత తాను తీసుకునే పారితోషికంలో కోటీ రూపాయలు తగ్గించాలనుకుందట. ఆ విషయాన్ని మేనేజర్‌కి చెప్పిందట. కోటీ రూపాయలు తక్కువగా తీసుకోవాలని చెప్పింది. కానీ సమంత ఎలాగూ అనారోగ్యంతో బాధపడుతుందని, ఆ విషయం పెద్దగా పట్టించుకోదని చెప్పి, ఆ మేనేజర్‌ నిర్మాతల నుంచి ఆమె పూర్తి పారితోషికం తీసుకున్నాడట. పైగా దాన్ని లిక్విడ్‌ క్యాష్‌ రూపంలో తీసుకునేందుకు, ఆ కోటి రూపాయలు సమంతకి తెలియకుండా నొక్కేసేందుకు ప్లాన్‌ చేశాడట. 

మైత్రీ నిర్మాతలు కోటీ రూపాయలు లిక్విడ్‌ ఇవ్వలేమని చెప్పగా, అతను తన ఫ్రెండ్స్ అకౌంట్స్ ఇచ్చే ప్రయత్నంచేశాడట. అతనిపై అనుమానం వచ్చిన నిర్మాతలు సమంతకి సమాచారం అందించడంతో అసలు విషయం బయటపడింది. దీంతో ఆ మేనేజర్‌పై చర్యలు తీసుకునే పనిలో ఉందట సమంత. ఆంగ్ల పత్రికల్లో వచ్చిన ఈ వార్తలు ఇప్పుడు అటు ఫిల్మ్ నగర్‌లో, ఇటు సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌ అవుతున్నాయి. ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. దీనిపై సమంతగానీ, నిర్మాతలు గానీ స్పందిస్తే క్లారిటీ వస్తుంది.

సమంత మేనేజర్‌ ఇండస్ట్రీలో చాలా కాలంగా ఉన్నాడు. పెద్ద స్టార్ హీరోల నుంచి స్టార్‌ హీరోయిన్లు, యంగ్ హీరోలు, క్యారెక్టర్‌ ఆర్టిస్టులకు కూడా మేనేజర్‌గా చేశాడు. ఇప్పుడు కూడా చేస్తున్నాడు. మేనేజర్‌గా బాగా పేరుపొందిన ఆయన ఇలాంటి మోసానికి పాల్పడ్డారనే వార్త ఇండస్ట్రీని ఉలిక్కిపాటుకి గురి చేస్తుంది. ఇంకా ఎలాంటి మోసాలు చేశాడనే ఆరా తీసే పనిలో ఆయన్ని మేనేజర్‌గా పెట్టుకున్న వారంతా ఉన్నట్టు సమాచారం. క సమంత, విజయ్‌ దేవరకొండ కలిసి నటించిన `ఖుషి` సినిమా రేపు శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి
Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?