470 కేజీల వెండి చైన్స్ తో పవన్ కళ్యాణ్ రూపం.. వైరల్ గా మారిన పవర్ స్టార్ ఫేస్ ఆర్ట్.. వీడియో చూశారా?

Published : Aug 31, 2023, 07:04 PM IST
470 కేజీల వెండి చైన్స్ తో పవన్ కళ్యాణ్ రూపం..  వైరల్ గా మారిన పవర్ స్టార్ ఫేస్ ఆర్ట్.. వీడియో చూశారా?

సారాంశం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సెలబ్రేషన్స్  ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఫ్యాన్స్  రకరకాలుగా అభిమానం చాటుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.   

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)  ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయనకు ఎంతటి డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారో తెలిసిందే. ఆయన సినిమాల విడుదల సమయంలో, ప్రత్యేక రోజుల్లో వారి హవా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రీసెంట్ గా ‘బ్రో : ది అవతార్’ చిత్ర విడుదల సందర్భంగా పండుగా చేస్తున్న అభిమానులు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సెలబ్రేషన్స్ లో బిజీగా ఉన్నాయి. ఈ సందర్భంగా ఫ్యాన్స్ పవర్ స్టార్ పై తమ అభిమానాన్ని రకరకాలు గా చూపిస్తున్నారు. 

సెప్టెంబర్ 2న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కావడం విశేషం. ఈ సందర్భంగా ఆయన అభిమానులు వారం రోజుల ముందు నుంచే వేడుకలను ప్రారంభించారు. పలు సేవా కార్యక్రమాలు, బ్లడ్ క్యాంప్ లు నిర్వహిస్తూ ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ గా మారింది. పవన్ కళ్యాణ్ అభిమాని ఒకరు 470 కేజీల వెండి చైన్లతో పవర్ స్టార్ ఫేస్ ఆర్ట్ ను రూపొందించారు. సిల్వర్ చైన్స్ తో పవన్ కళ్యాణ్ రూపాన్ని  తీర్చిదిద్దడం అభిమానులను ఆకట్టుకుంటోంది. 

ఇక పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు అభిమానులు సిద్ధంగా ఉన్నారు. ఇక ఫ్యాన్స్ కోసం పవన్ కెరీర్ లోనే ప్రత్యేకంగా నిలిచిన ‘గుడుంబా శంకర్’ చిత్రాన్ని రీరిలీజ్ చేస్తున్నారు. సెప్టెంబర్ 2న రీరిలీజ్ కు థియేటర్లు సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని నాలుగైదు థియేటర్లలో పలు షోలు ఫిక్స్ అయ్యాయి. ఆ రోజు రచ్చ చేసేందుకు ఫ్యాన్స్  ప్రిపేర్ అవుతున్నారు. 

ఇదిలా ఉంటే.. పవన్ కళ్యాణ్ బర్త్ డే గిఫ్ట్ గా OG చిత్రం నుంచి పవర్ ఫుల్ టీజర్ రాబోతోంది. ఈ ఫస్ట్ అప్డేట్ పై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. అప్డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని ’సాహో’ దర్శకుడు సుజీత్ డైరెక్ట్ చేస్తున్నారు. డీవీవీ బ్యానర్ పై నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. చిత్రంలో తమిళ స్టార్ అర్జున్ దాస్, బాలీవుడ్ స్టార్ హీర్ ఇమ్రాన్ హష్మిన్, శ్రియా రెడ్డి, ప్రియాంక మోహనన్ నటిస్తున్నారు. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss 9 Finale Voting : కళ్యాణ్ పడాల , తనూజ మధ్య అసలు పోటీ.., ఫినాలే ఓటింగ్ లో ఎవరు ముందున్నారంటే?
Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ