
జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కలిసి మల్టీస్టారర్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రం రిలీజ్ డేట్ వార్త బయిటకు వచ్చింది. యష్ రాజ్ ఫిలిమ్స్ కి చెందిన వార్ సినిమా సీక్వెల్ వార్ 2 గా తెరకెక్కిస్తున్నారు.ఇందులో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి నటించనున్నారు. ఈ సినిమాకు బ్రహ్మాస్త్ర డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించబోతున్నారు. బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలిమ్స్ స్పై చిత్రాలలో వార్ 2 తెరకెక్కబోతుంది.
ఇక తాజాగా ఈచిత్రం రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసారు. #War2 చిత్రం 24 జనవరి 2025 న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ నజీర్ అనే పాత్రలో కనిపించబోతున్నట్లు ఫ్యాన్ మేడ్ పోస్టర్ బయిటకు వచ్చింది. హృతిక్ రోషన్ పాత్ర కబీర్ అంటున్నారు.మీరూ ఆ పోస్టర్ ని చూడవచ్చు.
ఇక వార్ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ లు ఓ రేంజ్ లో ఉంటాయి. టైగర్, హృతిక్ పోటీ పడి నటించారు. ఇప్పుడు ఎన్టీఆర్, హృతిక్ కలిసి ఒకే స్క్రీన్ పై కనిపిస్తే ఫ్యాన్స్ కు పూనకాలే అని చెప్పాలి. ఇక ట్రేడ్ పరంగా చూస్తే బాక్సాఫీస్ రికార్డులు బద్ధలే. ఎన్టీఆర్ బాలీవుడ్ అరంగేట్రం ఈ సినిమాతోనే.. బ్రహ్మాస్త్ర సినిమాను తెరకెక్కించిన అయాన్ ముఖర్జీ దీనికి దర్శకుడు కావటం కలిసి వచ్చే అంశం.
ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' అనే సినిమాను ఎన్టీఆర్ చేస్తున్నారు. ఈ సినిమా టైటిల్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో జాన్వీకపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. సైఫ్ అలీ ఖాన్ విలన్ గా కనిపించనున్నాడు.