ఇన్స్టా బయో మార్చిన సమంత.. ఆమెకి ఇది పర్ఫెక్ట్ కదా..

Published : Oct 01, 2022, 02:45 PM ISTUpdated : Oct 01, 2022, 02:47 PM IST
ఇన్స్టా బయో మార్చిన సమంత.. ఆమెకి ఇది పర్ఫెక్ట్ కదా..

సారాంశం

సమంత సౌత్ లో ప్రస్తుతం తిరుగులేని స్టార్. నార్త్ లో కూడా క్రమంగా సమంత క్రేజ్ పెరుగుతోంది. సమంతకి  బాలీవుడ్ చిత్రాల్లో ఆఫర్స్ వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

సమంత సౌత్ లో ప్రస్తుతం తిరుగులేని స్టార్. నార్త్ లో కూడా క్రమంగా సమంత క్రేజ్ పెరుగుతోంది. సమంతకి  బాలీవుడ్ చిత్రాల్లో ఆఫర్స్ వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఫ్యామిలీ మ్యాన్ 2తో సమంత నెగిటివ్ షేడ్స్ లో నటించిన అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. హాలీవుడ్ చిత్రాల్లో కూడా నటించేందుకు సమంత రెడీ అవుతోంది. 

నాగ చైతన్యతో బ్రేకప్ సమంత ఏం చేసినా వైరల్ గా మారుతోంది. సమంత సోషల్ మీడియాలో చిన్న పోస్ట్ పెట్టినా ఫ్యాన్స్ ఎగబడి చూసేస్తున్నారు. ఇటీవల సమంత యుఎస్ లో చికిత్స తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేకపోవడంతో ఆ రూమర్స్ బలపడ్డాయి. 

సమంత స్కిన్ వ్యాధితో బాధపడుతోంది అని అందుకే ఆమె యుఎస్ లో చికిత్స తీసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. శాకుంతలం మూవీ ప్రమోషన్స్ లో భాగంగా సమంత తిరిగి సోషల్ మీడియాలో యాక్టివ్ గా మారింది. ఇన్స్టాగ్రామ్ లో ఆసక్తికరంగా సామ్ తన బయో మార్చింది. 

మీ సామర్థ్యాల పరిమితి ఎంత ఉన్నా.. దానిని ఇంకొంచెం విస్తరించాలి అని సమంత ఇన్స్టాగ్రామ్ బయోలో పేర్కొంది. ఇది సరిగ్గా సమంతకి యాప్ట్ అవుతుంది అనే చెప్పాలి. టాలీవుడ్ చిత్రాలతో మొదలైన సమంత ప్రయాణం ఆమెని స్టార్ హీరోయిన్ స్థాయికి చేర్చింది. ఇప్పుడు సమంత కి బాలీవుడ్ లో కూడా క్రేజ్ పెరిగింది. పాన్ ఇండియా చిత్రాల్లో నటిస్తోంది. అలాగే సమంత ఇటీవల ఒక హాలీవుడ్ చిత్రానికి కూడా సైన్ చేసింది.  ఎప్పటికప్పుడు సమంత నటిగా తన బౌండరీస్ పెంచుకుంటూ వెళుతోంది. 

PREV
click me!

Recommended Stories

Jr NTR: జూ.ఎన్టీఆర్ మిస్సైన పొలిటికల్ మూవీ.. బెదిరింపులు ఏ రేంజ్ లో వచ్చాయో తెలుసా ?
OTT Movies: ఓటీటీలో దుమ్ములేపుతున్న తెలుగు థ్రిల్లర్‌ ఇదే.. లిస్ట్‌