అల్లు స్టూడియో ప్రారంభం.. చీఫ్ గెస్ట్ గా హాజరై లాంచ్ చేసిన మెగాస్టార్.!

Published : Oct 01, 2022, 02:13 PM IST
అల్లు స్టూడియో ప్రారంభం.. చీఫ్ గెస్ట్ గా హాజరై లాంచ్ చేసిన మెగాస్టార్.!

సారాంశం

ప్రముఖ నిర్మాత అల్లు రామలింగయ్య జ్ణాపకార్థంగా నిర్మించిన ‘అల్లు స్టూడియో’ (Allu Studio) ఈరోజు గ్రాండ్ గా ప్రారంభం అయ్యింది. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అథిగా హాజరై స్టూడియోను లాంచ్ చేశారు.   

ప్రముఖ దిగ్గజ హాస్య నటుడు, నిర్మాత అల్లు రామలింగయ్య జ్ఞాపకార్థంగా హైదరాబాద్ లోని కోకాపేటలో `అల్లు స్టూడియో`ను నిర్మించిన విషయం తెలిసిందే. ఈ రోజు అల్లు రామలింగయ్య 100వ పుట్టిన రోజు సందర్భంగా స్టూడియోను గ్రాండ్ గా ప్రారంభించారు. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) చీఫ్ గెస్ట్ గా హాజరై స్టూడియోను లాంచ్ చేశారు. 

దివంగత నటుడు అల్లు రామలింగయ్య శత జయంతి సందర్భంగా ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. గతేడాది ప్రారంభించిన స్టూడియో నిర్మాణాన్ని పది ఎకరాల్లో అత్యాద్భుతంగా  నిర్మించి ఈరోజు ప్రారంభించారు. స్టూడియో వద్ద అల్లు అర్జున్, మెగాస్టార్ చిరంజీవిలకు కూడా భారీ కటౌట్స్ ఏర్పాటు చేసి స్వాగతం పలికారు. ప్రారంభోత్సవానికి హాజరైన చిరంజీవి, సతీమణి సురేఖతో కలిసి తొలుత అల్లు రామలింగయ్య విగ్రహానికి గజమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు.  కార్యక్రమానికి అల్లు వారి బంధుమిత్రలతోపాటు.. అభిమానులు కూడా హాజరయ్యారు. 

ఇప్పటికే షూటింగ్‌లకు అన్నపూర్ణ స్టూడియో, రామానాయుడు స్టూడియో, పద్మాలయ స్టూడియో, సారధి స్టూడియోలు ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వీటికి ధీటుగా ‘అల్లు స్టూడియో’ను అత్యాధునిక టెక్నాలజీతో, ప్రపంచ స్థాయి సదుపాయాలతో నిర్మించారు. సినిమాకి సంబంధించిన అన్ని పనులు ఇందులో చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అల్లు అర్జున్ నటిస్తున్న ‘పుష్ఫ 2’ చిత్ర షూటింగ్  చాలా మేరకు ఈ స్టూడియోలోనే జరగనుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్ర రెగ్యూలర్ షూటింగ్ కు సంబంధించిన పూాజా కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి.   

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Dhurandhar 2 Box Office: కలెక్షన్లలో భారీ డ్రాప్, అయినా `ధురంధర్‌ 2` సరికొత్త రికార్డు
Jr NTR: జూ.ఎన్టీఆర్ మిస్సైన పొలిటికల్ మూవీ.. బెదిరింపులు ఏ రేంజ్ లో వచ్చాయో తెలుసా ?