
అక్కనేని నాగార్జున కుమారుడు అక్కినేని నాగ చైతన్య సమంతల ఎంగేజ్ మెంట్ అయ్యిందికానీ చాలా రోజులు కావటంతో ఇక పెళ్లి కోసం తొందరపడుతున్నారు. వచ్చే ఆగస్ట్‌లో ఈ టాలీవుడ్ హాట్ కపుల్ వివాహం చేసుకోబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే ఎంగేజ్‌మెంట్ చేసుకున్న వీరిద్దరూ త్వరగా పెళ్లి చేసుకోవాలని ప్రస్తుతం వేర్వేరు ప్రాంతాల్లో చెమటోడుస్తున్నారు.
ప్రస్థుతం నాగచైతన్య హైదరబాద్‌లో కల్యాణకృష్ణ సినిమా ‘రారండోయ్ వేడుక చూద్దాం’ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఇది పూర్తయిన వెంటనే చందు మొండేటి సినిమాను కూడా ప్రారంభించేస్తాడు. ఈ రెండు సినిమాల పనులు వీలైనంత త్వరగా పూర్తి చేసుకోవాలని నాగ చైతన్య తెగ కష్ట పడుతున్నాడు.
ఇక మరోవైపు సమంత రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రామ్‌చరణ్ సినిమాతో బిజీగా ఉంది. ఈ సినిమాతోపాటు ‘రాజుగారి గది-2’, ‘మహానటి’ సినిమాలను కూడా లైన్లో పెట్టింది. ఓ పక్క ఎండలు భగ్గుమంటున్నా.. షూటింగులన్నీ ఆగస్టుకల్లా పూర్తి చేసుకోవాలని తెగ కష్టపడుతోంది సామ్. వీళ్లిద్దరి స్పీడు చూస్తుంటే.. ఆగస్ట్ నాటికి అంగీకరించిన సినిమాలు పూర్తి చేసేసి పెళ్లిపీటలు ఎక్కేసి... వీలైనంత త్వరలోనే అక్కినేని వారసున్ని కూాడా ఇచ్చేస్తారేమో..అనిపిస్తోంది కదూ.