ఇటీవలే ‘జవాన్’లో కనపడి దుమ్ము రేపింది నయనతార. అలాగే పుష్ప తర్వాత రష్మిక అక్కడ వరస అవకాశాల్ని సొంతం చేసుకొంటూనే ఉంది. తాజాగా సమంత, అనుష్క విషయంలోనూ బాలీవుడ్‌లో జోరుగా చర్చ జరుగుతున్నట్లు సమాచారం .
విజయ్ దేవరకొండతో చేసిన ‘ఖుషి’తో ఇటీవలే విజయాన్ని సొంతం చేసుకుంది సమంత.మరో ప్రక్క మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది అనుష్క. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా కమర్షియల్ సక్సెస్ అయ్యినట్లే. అయితే ఇద్దరూ ఆచి,తూచి తమ కెరీర్ లో అడుగులు వేస్తున్న హీరోయిన్సే. ఇక్కడో ట్విస్ట్ ..ఇది మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీ కాబట్టి హీరోలు ఎవరని కోరుకుంటే వారే ..వాళ్లే పెద్ద సినిమాల్లో హీరోయిన్స్ అవుతూంటారు. ఈ క్రమంలో ఇప్పుడు సమంత, అనుష్క మధ్య పోటీ పడిందని బాలీవుడ్ మీడియా అంటోంది.
గత కొనేళ్లుగా బాలీవుడ్ ని ఎట్రాక్ట్ చేయటంలో ముందున్నారు మన సౌత్ ఇండియన్ హీరోయిన్స్ లు. అక్కడి నుంచి చాలా మంది ఇక్కడకు వస్తున్నా..మన వాళ్లపై అక్కడ స్టార్స్ ఒక కన్నేసి ఉంటారు. ఇక్కడ పాపులర్ హీరోయిన్ ని తీసుకుంటే సౌత్ మార్కెట్ లోనూ బిజినెస్ ఇబ్బంది ఉండదని వాళ్లకు తెలుసు. ఈ క్రమంలో సౌత్ హీరోయిన్స్ తరచూ అదిరిపోయే ఆఫర్స్ సొంతం చేసుకొంటున్నారు. ఇటీవలే ‘జవాన్’లో కనపడి దుమ్ము రేపింది నయనతార. అలాగే పుష్ప తర్వాత రష్మిక అక్కడ వరస అవకాశాల్ని సొంతం చేసుకొంటూనే ఉంది.
తాజాగా సమంత విషయంలోనూ బాలీవుడ్‌లో జోరుగా చర్చ జరుగుతున్నట్లు సమాచారం . సల్మాన్‌ఖాన్ హీరోగా నటిస్తున్న సినిమాలో సమంత నటిస్తుందనే ప్రచారమే ఆ చర్చకి కారణం. పవన్ తో పంజా చిత్రం తీసిన విష్ణువర్ధన్ దర్శకత్వంలో సల్మాన్‌ఖాన్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కనుంది. అందులో సౌత్ హీరోయిన్ నే తనకి జోడీగా నటించాలనేది సల్మాన్ నిర్ణయమని సమాచారం. ఆ మేరకు సమంత పేరు ప్రచారంలోకి వచ్చింది. అంతకుముందు త్రిష పేరు కూడా వినిపించింది. ఇదిలా ఉండగా ఈ వార్తల్లోకి అనుకోని విధంగా అనుష్క వచ్చి చేరింది.
సల్మాన్ ఖాన్ ..సమంత తో పాటు అనుష్క ని కూడా తమ ప్రక్కన బాగానే ఉంటుందని చెప్పినట్లు సమాచారం. ఆమెకు బాహుబలితో క్రేజ్ ఉంది. దాంతో సినిమాకు ప్లస్ అవుతుంది. కరుణ్ జోహార్ కు బాహుబలి టీమ్ తో బాగా పరిచయం ఉంది. ఈ క్రమంలో అనుష్క తో వెళ్దామని సల్మాన్ ప్రపోజల్ పెట్టినట్లు చెప్పుకుంటున్నారు. దీనికి సపోర్ట్ గా సోషల్ మీడియాలో సల్మాన్ ఫ్యాన్స్‌తో పాటు కొందరు నెటిజన్లు మాత్రం ఈ సినిమాలో సమంత కంటే అనుష్క బెటర్ అనటం గమనించవచ్చు. మరి అవకాశం ఎవరికి దక్కుతుందో చూడాలి. ఈ విషయాలన్ని గమనిస్తున్నా సమంత మాత్రం సైలెట్ గా ఉండటం గమనార్హం.