సమంత, విజయ్ 'ఖుషి' ట్రైలర్.. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ నుంచి గొడవల వరకు, మస్త్ షేడ్స్ ఉన్నాయ్ గా

Published : Aug 09, 2023, 04:10 PM IST
సమంత, విజయ్ 'ఖుషి' ట్రైలర్.. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ నుంచి గొడవల వరకు, మస్త్ షేడ్స్ ఉన్నాయ్ గా

సారాంశం

విజయ్ దేవరకొండ, సమంత జంటగా జంటిస్తున్న రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ చిత్రం ఖుషి.  మజిలీ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం సెప్టెంబర్ 1న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది.

విజయ్ దేవరకొండ, సమంత జంటగా జంటిస్తున్న రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ చిత్రం ఖుషి.  మజిలీ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం సెప్టెంబర్ 1న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ సోషల్ మీడియాలో యువతని ఊపేస్తున్నాయి. ముఖ్యంగా నా రోజా నువ్వే అనే సాంగ్. రిలీజ్ టైం దగ్గర పడుతుండడంతో తాజాగా ఖుషి ట్రైలర్ విడుదల చేశారు. 

ట్రైలర్ కట్ సింప్లి సూపర్బ్ అనే చెప్పాలి. ట్రైలర్ చూస్తుంటే దర్శకుడు శివ నిర్వాణ తన స్ట్రెంత్ ని నమ్ముకుని లవ్, మ్యారేజ్ అంశలతో ఎమోషనల్ అండ్ ఎంటర్టైనింగ్ స్టోరీని పక్కాగా రాసుకున్నారు అనిపిస్తోంది. ట్రైలర్ లో దర్శకుడు ఆల్మోస్ట్ స్టోరీ థీమ్ ఏంటో వివరించేశారు. ట్రైలర్ లో విశేషాలు గమనిస్తే.. 

కశ్మీర్ కి వెళ్లిన క్రిస్టియన్ యువకుడు విప్లవ్( విజయ్ దేవరకొండ) కి ముస్లిం యువతి బేగమ్ (సమంత) పరిచయం అవుతుంది. ఆమెని చూసి ప్రేమలో పడతాడు హీరో. కానీ అంతా అనుకుంటున్నట్లు ఆమె తాను ముస్లిం కాదని బ్రాహ్మణ కులానికి చెందిన యువతని అని సమంత చెబుతుంది. అంటే క్రిస్టియన్, హిందూ లవ్ స్టోరీ అన్నమాట. 

అన్ని చిత్రాల్లో లాగానే ఈ మూవీలో కూడా వీరిద్దరి ప్రేమకి కుటుంబ పెద్దలు అంగీకరించడం లేదని ట్రైలర్ లో అర్థం అవుతుంది. కానీ వీరిద్దరూ తమ కుటుంబాలని ఎదిరించి వివాహం చేసుకుంటారు. ఏడాదిలో మనిద్దరం బెస్ట్ కపుల్స్ అని నిరూపించాలి అని సమంత చెప్పే డైలాగ్స్ ఫన్నీగా ఉంటారు. వివాహం తర్వాత సామ్, విజయం మధ్య జరిగే గొడవలని శివ నిర్వాణ చాలా ఫన్నీగా ప్రజెంట్ చేశారు. 

పెళ్లంటేనే చావురా.. నువ్వు ఎప్పుడో చచ్చావ్ అంటూ రాహుల్ రామకృష్ణ చెప్పే ఫన్నీ డైలాగ్స్ కూడా బావున్నాయి. ఎందుకు భయపడుతున్నావ్ అమ్మా నువ్వు.. మార్కెట్ లో నా గురించి అట్లా అనుకుంటున్నారు కానీ నేను స్త్రీ పక్షపాతిని అతనూ విజయ్ చేసే కామెంట్స్ ట్రైలర్ లో ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. తెలిసిన స్టోరీలాగే అనిపిస్తున్నప్పటికీ.. విజయ్, సమంతలతో శివ నిర్వాణ మ్యాజిక్ చేయబోతున్నట్లు అనిపిస్తోంది. ఫ్యామిలీ ఆడియన్స్, యువతని టార్గెట్ గా శివ నిర్వాణ ఈ చిత్రం తెరకెక్కించినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఖుషి ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉంది. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా