
సూపర్ స్టార్ మహేశ్ బాబు 48 ఏళ్ళు పూర్తి చేసుకుని 49వ ఏడాదిలోకి అడుగుపెడుతున్నాడు. ఈరోజు ( అగస్ట్ 09) మహేష్ బర్త్ డే సందర్భంగా.. కోట్లాది అభిమానుల నుంచి మహేష్ కు వరుసగా విషెష్ అందుతున్నాయి. అంతే కాదు.. సినీ రాజకీయ సెలబ్రిటీల నుంచి కూడా మహేష్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు అందాయి. అయితే ఇవన్నీ ఒక ఎత్తైతే.... మహేష్ భార్య నమ్రత చెప్పిన విషెష్ ఆయనకు వెరీ స్పెషల్ అని చెప్పాలి.
తన సోషల్ మీడియా అకౌంట్ నుంచి ఇన్ స్టా గ్రామ్ వేదికగా మహేష్ ను విష్ చేసింది నమ్రత. మహేష్ బాబుతో కలసి ఉన్న ఫొటోను నమ్రత పోస్ట్ చేసింది. కుటుంబమంతా కలసి వెకేషన్ కు వెళ్లిన ఆ ఫోటోలో రాత్రివేళ.. టెర్రస్ పై ఇద్దరు ఏకాంతంగా ఉన్నప్పటి ఫోటోను శేర్ చేసింది నమ్రత. మహేశ్ ను వెనుక నుంచి హత్తుకుని .. ప్రేమతో ముద్దాడున్న ఈ ఫోటోతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారుజంట. ఈ ఫోటోకు హ్యాపీ బర్త్ డే ఎంబీ ఈ రోజు, ప్రతి రోజూ నీవే, నీవే అంటూ క్యాప్షన్ పెట్టింది.
ప్రస్తుతం నమ్రత పోస్ట్ వైరల్ అవుతోంది. సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఈ పోస్ట్ చూసి మెస్మరైజ్ అవుతున్నారు. మహేశ్ బాబు ఫ్యామిలీ మ్యాన్ అని అందరికీ తెలిసిందే. ఆయన షూటింగ్ ఉంటేనే బయట కనిపిస్తారు. లేదంటే మిగతా టైమ్ అంతా ఫ్యామిలీకే కేటాయిస్తారు. బయటకు వెళ్లాలంటే ఒక్కడే వెళ్ళడం చాలా అరుదు. ఫ్యామిలీని తీసుకుని టూర్లకు ఎక్కువగా వెళ్తుంటారు మహేష్. తాజాగా భార్య, పిల్లలలతో కలిసి ప్రస్తుతం విదేశీయాత్రలో ఉన్నాడు మహేష్. బర్త్ డేను కూడా ఫారెన్ లోనే సెలబ్రేట్ చేసుకుంటున్నాడు.
ఇక ఆయన సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరుకారం సినిమాలో మహేష్ బాబు నటిస్తున్నాడు.ఖలేజా తర్వాత దాదాపు పుష్కర కాలానికి వీరి కాంబో కలిసింది. మహేష్, తివ్రిక్రమ్ కలసి పనిచేస్తున్న మూడో సినిమా ఇది. మరోవైపు రాజమౌళి పాన్ ఇండియా మూవీలోనూ మహేష్ బాబు నటించబోతున్నాడు. త్రివిక్రమ్ సినిమా అయిపోగానే ఈ సినిమాలోజాయిన్ కాబోతున్నడట మహేష్.