
గెట్ రెడీ ఫ్యాన్స్.. తారక్ లుక్ పై ఓ లుక్కేశారా.. ఎన్టీఆర్ న్యూ లుక్ ను గమనించారా.. ఎలా ఉన్నాడో.. తాజాగా తారక్ కొత్త అవతారం వైరల్ అవుతోంది. ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాతో గ్లోబల్ ఇమేజ్ సాధించిన ఎన్టీఆర్.. వరుస ప్రాజెక్ట్ లను లైన్ లో పెట్టాడు. ఫుల్ జోష్ తో దూసుకుపోతున్నాడు. ఇటు సినిమాలు చేస్తూ.. అటు ఫేమస్ బ్రాండ్స్ కు అంబాసిడర్ గా ఎన్టీఆర్ ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఒక పక్క బ్లాక్ బస్టర్ కాంబినేషన్ లో సినిమాలు సెట్ చేస్తూనే.. మరోపక్క కమర్షియల్ యాడ్స్ తో కూడా అదరగొడుతున్నాడు.
ఈ క్రమంలోనేఅటు జ్యూవ్వల్లరీ యాడ్ తో పాటు.. ఫుడ్ యాప్స్..డ్రింక్స్ కు సబంధించిన ఫేమస్ బ్రాండ్స్ ను అడ్వటైజ్ చేస్తున్నాడు. ఈమధ్య ఎన్టీఆర్ ఖాతాలో మరిన్ని బ్రాండ్స్ వచ్చి చేరాయి. ఇప్పటికే లీషియస్, యాపీ ఫిజ్ మెక్ డొనాల్డ్స్ వంటి యాడ్స్ తో బిజీ అయిపోయాడు. ఈ యాడ్స్ కోసం కొత్త కొత్త లుక్స్ ను ట్రై చేస్తున్నాడు ఎన్టీఆర్. తాజాగా ఆయన ఖాతలో మరో ప్రాడెక్ట్ యాడ్ అవ్వడంతో.. దానికి సబంధించిన షూట్ జరిగింది. ఈ షూట్ లో తారక్ డిఫరెంట్ లుక్ లో కనిపించాడు.
ఈ యాడ్ లో ఎన్టీఆర్ స్టైలిష్ గా కనిపించేలా ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ అలీమ్ హకీమ్.. ఎన్టీఆర్ ని అదిరిపోయే లుక్స్ లో రెడీ చేశాడు. గడ్డం, కళ్ళజోడు, వావ్ అనిపించే హెయిర్ స్టైల్ తో ఎన్టీఆర్ సూపర్ ఉన్నాడు.ప్రస్తుతం ఎన్టీఆర్ తాజా లుక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతే కాదు ఎన్టీఆర్ కు సబంధించిన మరో న్యూస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తారక్ ఒక్కో యాడ్ కోసం దాదాపు 8 కోట్లు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. యాడ్ కే ఇంత డియాండ్ చేస్తున్నాడంటే.. ముందు ముందు సినిమాలకు ఎంత తీసుకుంటాడా అని అనుకుంటున్నాడు.
ఇక సినిమాల విషయానికి వస్తే.. కొరటా శివ డైరెక్షన్ లో దేవర సినిమా చేస్తున్నాడు తారక్. ఈమూవీ ద్వారా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ సౌత్ ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈమూవీ షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతోంది. ఈసినమాలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తుండగా... ఇతర పాత్రల్లో స్టార్ కాస్ట్ సందడి చేయబోతోంది. ఈ సినిమా తరువాత బాలీవుడ్ బిగ్ ప్రాజెక్ట్ వార్ 2 లో భాగం కాబోతున్నాడు ఎన్టీఆర్. హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ బాలీవుడ్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు.