Samantha Item Song: సమంత ఊరమాస్‌ సాంగ్‌... `ఊ అంటవా మావ.. ఉ ఉ అంటావా`.. ఫ్యాన్స్ కి పండగే

Published : Dec 10, 2021, 06:51 PM IST
Samantha Item Song: సమంత ఊరమాస్‌ సాంగ్‌... `ఊ అంటవా మావ.. ఉ ఉ అంటావా`.. ఫ్యాన్స్ కి పండగే

సారాంశం

 `ఊ అంటవా మావ.. ఊఊ అంటావా ` అంటూ సాగే స్పెషల్‌ నెంబర్ ని శుక్రవారం సాయంత్రం విడుదల చేశారు. ఇందులో సమంత డాన్సులు చేయడం విశేషం. ఆమె గ్లామర్‌ డాల్‌గా మారి చేసిన ఈ హాట్‌ డాన్సు నెంబర్‌ ఇప్పుడు ఊపేస్తుంది.

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌(Allu Arjun) నటిస్తున్న చిత్రం `పుష్ప`(Pushpa). క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ చిత్రంలోని మొదటి భాగంగా `పుష్పః ది రైజ్‌` వచ్చే వారం విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్‌ కార్యక్రమాల జోరు పెంచింది యూనిట్‌. అందులో భాగంగా తాజా ఈ సినిమాలోని స్పెషల్‌ సాంగ్‌ని విడుదల చేసింది. `ఊ అంటవా మావ.. ఊఊ అంటావా `(Oo Antava Mava) అంటూ సాగే స్పెషల్‌ నెంబర్ ని శుక్రవారం సాయంత్రం విడుదల చేశారు. ఇందులో సమంత(Samantha) డాన్సులు చేయడం విశేషం. ఆమె గ్లామర్‌ డాల్‌గా మారి చేసిన ఈ హాట్‌ డాన్సు నెంబర్‌ ఇప్పుడు ఊపేస్తుంది. మాస్‌ బీట్‌గా సాగుతూ మెప్పిస్తుంది. జస్ట్ లిరికల్‌ వీడియోనే ఈ రేంజ్‌లో ఆకట్టుకుంటుంటే, ఇక సినిమాలో పూర్తి వీడియో సాంగ్‌ ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహించుకోవచ్చు. పైగా Samantha చేసిన మాస్‌ బీట్‌ డాన్సు మరింతగా మంత్రముగ్దుల్ని చేస్తుందని చెప్పొచ్చు. 

ఈ పాటకి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తుండగా, చంద్రబోష్‌ ఈ పాటని రాశారు. ఇంద్రావతి చౌహాన్‌ ఆలపించారు. ఈ పాటని ఐదు భాషల్లో ఏకకాలంలో విడుదల చేశారు. ప్రస్తుతం ఇది యూట్యూబ్‌లో ట్రెండింగ్‌ అవుతుండటం విశేషం. సినిమాకిది హైలైట్‌గా నిలువబోతుందని చెప్పొచ్చు. ఫస్ట్ టైమ్‌ సమంత స్పెషల్‌ సాంగ్‌ చేస్తున్న నేపథ్యంలో దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పాట కోసం ఆమె అభిమానులు ఈగర్‌గా వెయిట్‌ చేశారు. ఇప్పుడు పండగ చేసుకుంటున్నారు. సినిమాలో ఈ పాట ఓరేంజ్‌లో ఉర్రూతలూగిస్తుందని అంటోంది యూనిట్‌. 

అల్లు అర్జున్‌, రష్మిక మందన్నా జంటగా నటించిన `పుష్ప` చిత్రానికి సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో అనసూయ, సునీల్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మలయాళ హీరో ఫహద్‌ ఫాజిల్‌ నెగటిల్‌ రోల్‌ చేస్తున్నారు. ఈ సినిమా ఈనెల 17న గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీలోనూ పాన్‌ ఇండియా తరహాలో విడుదల చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. ట్రైలర్‌ సైతం మెప్పిస్తుంది. ఈ నెల 12న `పుష్ప` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని నిర్వహించబోతున్నారు. మరోవైపు అల్లు అర్జున్‌ ఇటీవల వరుసగా టీవీ షోలో, ఇతర సినిమాల ఈవెంట్లలో పాల్గొంటూ సందడి చేస్తున్న విషయం తెలిసిందే. 

also read: Samantha: చరణ్ మరదలు పెళ్ళిలో సమంత సందడి... క్లోజ్ ఫ్రెండ్ తో పాటు హాజరైన స్టార్ లేడీ

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: అలాంటి వాళ్ళు కప్ గెలిచినట్లు చరిత్రలో లేదు, ఈసారి బిగ్ బాస్ టైటిల్ ఎవరిదంటే ?
Kartik Aaryan: చెల్లి పెళ్లి వేడుకలో హంగామా చేసిన యంగ్ హీరో, సందడి మొత్తం అతడిదే.. వైరల్ ఫోటోస్