ఎమోషనల్ మూమెంట్.. RRR వేదికపై పునీత్ రాజ్ కుమార్ పాట పాడిన ఎన్టీఆర్

Sreeharsha Gopagani   | Asianet News
Published : Dec 10, 2021, 05:23 PM IST
ఎమోషనల్ మూమెంట్.. RRR వేదికపై పునీత్ రాజ్ కుమార్ పాట పాడిన ఎన్టీఆర్

సారాంశం

ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ ప్రస్తుతం దేశం మొత్తం చక్కర్లు కొడుతోంది. ట్రైలర్ రిలీజ్ కావడంతో జక్కన్న రాజమౌళి ప్రచార కార్యక్రమాలు షురూ చేశారు. దీనితో ఆర్ఆర్ఆర్ ట్రైలర్ సోషల్ మీడియాలో హోరెత్తిపోతోంది. 

ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ ప్రస్తుతం దేశం మొత్తం చక్కర్లు కొడుతోంది. ట్రైలర్ రిలీజ్ కావడంతో జక్కన్న రాజమౌళి ప్రచార కార్యక్రమాలు షురూ చేశారు. దీనితో ఆర్ఆర్ఆర్ ట్రైలర్ సోషల్ మీడియాలో హోరెత్తిపోతోంది. ఆర్ఆర్ఆర్ ట్రైలర్ లో రాంచరణ్, ఎన్టీఆర్ సాహసాలు.. యాక్షన్ స్టంట్స్ గురించి అభిమానులు చర్చించుకుంటున్నారు. 

ఇదిలా ఉండగా నేడు ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ బెంగుళూరులో ట్రైలర్ లాంచ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్, అలియా భట్, రాజమౌళి, దానయ్య తదితరులు హాజరయ్యారు. చిత్ర యూనిట్  ఈ కార్యక్రమంలో మీడియాతో ముచ్చటించింది. 

కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణం యావత్ దేశాన్ని శోకంలో ముంచెత్తిన సంగతి తెలిసిందే. కలలో కూడా ఊహించని విధంగా పునీత్ అకాల మరణం చెందారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్, రాంచరణ్ తో పాటు చాలా మంది స్టార్ హీరోలతో పునీత్ కు క్లోజ్ ఫ్రెండ్ షిప్ ఉంది. 

ఎన్టీఆర్ అయితే పునీత్ నటించిన చక్రవ్యూహ చిత్రంలో 'గెలయ గెలయా' అనే సాంగ్ పాడాడు. పునీత్ మరణించిన తర్వాత ఎన్టీఆర్ స్వయంగా బెంగుళూరు వెళ్లి నివాళులు అర్పించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ఆర్ఆర్ఆర్ మీడియా సమావేశంలో కన్నడ మీడియా ఎన్టీఆర్ ని పునీత్ గురించి ప్రశ్నించింది. పునీత్ తో మీకు మంచి రిలేషన్ ఉంది. ఒకసారి పునీత్ చిత్రంలోని పాట పాడండి అని మీడియా ప్రతినిధులు ఎన్టీఆర్ ని రిక్వస్ట్ చేసారు. 

ఆ విషాద సంఘటన (పునీత్ మరణం)  నన్ను బాగా డిస్టర్బ్ చేసింది. ఆయన ఎక్కడ ఉన్నా ఆశీస్సులు మా పై ఉంటాయి. ఇక నేను ఈ పాటని ఎక్కడా పాడను.. ఇదే చివరిసారి అని ఎన్టీఆర్ గెలయ గెలయ సాంగ్ పాడారు. ఈ కార్యక్రమం ప్రారంభానికి ముందు ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ పునీత్ కోసం కొన్ని నిమిషాలు మౌనం పాటించారు. 

Also Read: హీరోయిన్ ని చుట్టుముట్టిన ఆకతాయిలు.. ఎక్కడపడితే అక్కడ తాకుతూ, వీడియో వైరల్

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: అలాంటి వాళ్ళు కప్ గెలిచినట్లు చరిత్రలో లేదు, ఈసారి బిగ్ బాస్ టైటిల్ ఎవరిదంటే ?
Kartik Aaryan: చెల్లి పెళ్లి వేడుకలో హంగామా చేసిన యంగ్ హీరో, సందడి మొత్తం అతడిదే.. వైరల్ ఫోటోస్