Kisi Ka Bhai Kisi Ki Jaan Teaser : సల్మాన్ కిసీ కా భాయ్ కిసీ కి జాన్ టీజర్... వెంకీ అలా మెరిశాడు!

Published : Jan 25, 2023, 05:37 PM ISTUpdated : Jan 25, 2023, 05:43 PM IST
Kisi Ka Bhai Kisi Ki Jaan Teaser : సల్మాన్ కిసీ కా భాయ్ కిసీ కి జాన్ టీజర్... వెంకీ అలా మెరిశాడు!

సారాంశం

సల్మాన్ లేటెస్ట్ మూవీ టీజర్ విడుదల చేశారు. కిసీ కా భాయ్ కిసీ కి జాన్ లో మన టాలీవుడ్ హీరో వెంకీ నటిస్తుండగా ఆయన పాత్ర ఆసక్తి రేపుతోంది.   


బాలీవుడ్ స్టార్స్ పరిస్థితేమీ బాగోలేదు. హిట్ లేక నాలుగేళ్లు గ్యాప్ తీసుకున్న షారుక్ స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. పఠాన్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. బాహుబలి 2, కెజిఎఫ్ 2 ఓపెనింగ్ రికార్డ్స్ బద్దలు కొట్టింది. మరోవైపు సల్మాన్ కూడా వరుస పరాజయాలు ఎదుర్కొంటున్నారు. ఆయన గత చిత్రాలు రాధే, అంతిమ్ ఆశించిన స్థాయిలో ఆడలేదు. రాధే అయితే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. 

దీంతో ఆయన కూడా ఒక సాలిడ్ హిట్ ఇవ్వాలని కోరుకుంటున్నారు. ఫర్హాద్ సామ్జీ డైరెక్షన్ లో కిసీ కా భాయ్ కిసీ కి జాన్ మూవీ చేశారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా విక్టరీ వెంకటేష్ కీలక రోల్ చేశారు. నేడు కిసీ కా భాయ్ కిసీ కి జాన్ టీజర్ విడుదల చేశారు. యాక్షన్, ఎమోషన్, లవ్, ఫ్యామిలీ అంశాలు జోడించి పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించినట్లు టీజర్ చూశాక తెలుస్తోంది. 

ముఖ్యంగా వెంకీ రోల్ ఆసక్తి రోల్ రేపుతోంది. వెంకటేష్ లుంగీ కట్టి సౌత్ లుక్ లో కనిపించారు. పూజా వెంకీ చెల్లిగా కనిపించే అవకాశం కలదు. తెలుగు అమ్మాయి ప్రేమలో పడిన అబ్బాయిగా సల్మాన్ రోల్ ఉంటుందేమో చూడాలి. ఇక వెంకీకి దుమ్మురేపే యాక్షన్ సీన్స్ కూడా ఉన్నాయి. రంజాన్ కానుకగా కిసీ కా భాయ్ కిసీ కి జాన్ విడుదల కానుంది. సల్మాన్ ఖాన్ నిర్మించి నటిస్తున్నారు. దాదాపు రెండు నిమిషాల కిసీ కా భాయ్ కిసీ కి జాన్ టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. 

PREV
click me!

Recommended Stories

Samantha Honeymoon Plans, రాజ్ తో కలిసి రొమాంటిక్ ట్రిప్ ప్లాన్ చేసిన సమంత, ఎక్కడికి వెళ్లబోతున్నారో తెలుసా?
49 ఏళ్ల వయసులో ఇండియాకు మెడల్ సాధించిన నటి, ఏకంగా 4 పతకాలతో మెరిసిన ప్రగతి