#Pushpa2: `పుష్ప2` గురించి క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చిన రష్మిక మందన్నా.. రిలీజ్‌ ఈ ఏడాదిలోనే?

Published : Jan 25, 2023, 05:12 PM ISTUpdated : Jan 25, 2023, 05:14 PM IST
#Pushpa2: `పుష్ప2` గురించి క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చిన రష్మిక మందన్నా.. రిలీజ్‌ ఈ ఏడాదిలోనే?

సారాంశం

అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న `పుష్ప2` సినిమాకి సంబంధించి క్రేజీ అప్‌ డేట్‌ ఇచ్చింది నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్నా. 

`పుష్ప2` తెలుగుతోపాటు ఇండియా వైడ్‌గా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రాల్లో ఒకటి. ఈగర్‌గా వెయిట్‌ చేసే చిత్రాల్లోనూ మొదటి స్థానంలో ఉంటుందీ సినిమా. `పుష్ప` మొదటి భాగం హిట్ కావడంతో రెండో పార్ట్ పై అంచనాలు పెరిగాయి. అంచనాలకు మించి సినిమాని తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. దర్శకుడు సుకుమార్‌ రెండో భాగాన్ని మరింత బలమైన కథతో, మరింత హైతో తెరకెక్కిస్తున్నారు. కథ స్పాన్‌ పెంచి రూపొందిస్తున్నట్టు సమాచారం. అందుకోసమే పార్ట్ 2 స్టార్ట్ చేసేందుకు ఏడాది పాటు సమయం తీసుకున్నారు సుకుమార్‌. 

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా నటించిన `పుష్ప` మొదటి భాగంలో పుష్పరాజ్‌ రైజింగ్‌ని చూపించారు. ఎలా ఎదిగాడనేది చూపిస్తే, రెండో పార్ట్ లో ఆయన రూలింగ్‌ని చూపించబోతున్నారు. ఎర్రచందనం స్మగ్లర్‌ నుంచి సిండికేట్‌ లకే హెడ్‌గా ఆయన ఎదిగిన తీరు, ఆ తర్వాత రూల్‌ చేసే తీరుని, ఫాలింగ్‌ని చూపించబోతున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి రష్మిక మందన్నా స్పందించింది. ఇందులో ఆమె హీరోయిన్‌గా శ్రీవల్లి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. సినిమా గురించి అంచనాలు పెంచేస్తుంది. 

`మిషన్‌ మజ్ను` ప్రమోషన్‌లో పాల్గొన్న రష్మిక `పుష్ప2` గురించి చెబుతూ, తాను వచ్చే నెలలో షూటింగ్‌లో జాయిన్‌ కాబోతుందట. మొదటి పార్ట్ కంటే చాలా అద్భుతంగా ఉంటుందని, మైండ్‌ బ్లోయింగ్‌ చేసేలా ఉంటుందని చెప్పింది. ఫస్ట్ పార్ట్ కంటే రెండో పార్ట్ నెక్ట్స్ లెవల్‌లో ఉంటుందట. చూస్తే వాహ్‌ ఫీలింగ్‌ కలుగుతుందని చెప్పింది. అదే సమయంలో తన పాత్ర చాలా ఇంటెన్స్ గా ఉంటుందని పేర్కొంది. మరోవైపు విలన్‌గా భన్వర్‌ సింగ్‌ షెకావత్‌గా నటించిన మలయాళ నటుడు ఫహద్‌ ఫాజిల్‌ మాట్లాడుతూ, రిలీజ్‌ డేట్‌ని కన్ఫమ్‌ చేశారు. 

`పుష్ప2` వచ్చే ఏడాది రిలీజ్‌ కాబోతుందనే వార్తలొచ్చాయి. కానీ ఈ సినిమా ఈ ఏడాదిలోనే రిలీజ్‌ కానుందని చెప్పారు ఫహద్‌. ఆయన చెప్పిన దాని ప్రకారం ఈ ఏడాది క్రిస్మస్‌ కానుకగా ఈ సినిమా రిలీజ్‌ కానుందని టాక్‌. ప్రస్తుతం ఈ సినిమా వైజాగ్‌లో చిత్రీకరణ జరుపుకుంటుంది. ఓడరేవు తీరంలో షూట్‌ చేస్తున్నారు. ఆ తర్వాత ఏపీలోని పలు చోట్ల చిత్రీకరించనున్నారు. బ్యాంకాక్ షెడ్యూల్‌ని కూడా ప్లాన్‌ చేసినట్టు సమాచారం. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

మడత మంచం పై పడుకొని, ప్రకృతిని ఆస్వాదిస్తున్న అనసూయ
Bigg Boss Top 5: బిగ్‌ బాస్‌ తెలుగు 9 టాప్‌ 5 కంటెస్టెంట్లు వీరే.. ఒక్క లీక్‌తో లెక్కలన్నీ తారుమారు