సల్మాన్ ఖాన్, వెంకీలతో కలిసి రామ్ చరణ్ లుంగీ డాన్స్.. ‘ఏంటమ్మా’ సాంగ్ కు అదిరిపోయే స్టెప్పులు..

By Asianet News  |  First Published Apr 4, 2023, 2:14 PM IST

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ లేటెస్ట్ ఫిల్మ్ ‘కిసి కా బాయ్ కిసి  కా జాన్’. చిత్రం నుంచి తాజాగా క్రేజీ సాంగ్ విడుదలైంది.  సల్మాన్ ఖాన్, వెంకీలతో పాటు రామ్ చరణ్ కూడా అదిరిపోయే స్టెప్పులేశారు. ఆ వీడియో వైరల్ అవుతోంది.
 


సల్మాన్ ఖాన్ - రామ్ చరణ్ ఎంత ఫ్రెండ్లీగా ఉంటారో తెలిసిందే. చరణ్ కోసం సల్మాన్ ఖాన్ ఏకంగా ‘ఆచార్య’లో గెస్ట్ రోల్ లో అలరించారు. ఎలాంటి రెమ్యూనరేషన్ కూడా తీసుకోకుండా చేయడం గమనార్హం. అయితే సల్లూ భాయ్ Kisi Ka Bhai Kisi Ki Jaan సినిమాలో చరణ్ నటించబోతున్నారనే విషయం తెలిసిందే. ఈ చిత్రం నుంచి తాజాగా Yentamma సాంగ్ విడుదలైంది. ఇందులో చరణ్ సల్మాన్, వెంకీలతో కలిసి లుంగీలో డాన్స్ అదరగొట్టారు.

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్  ఖాన్ (Salman Khan) లేటెస్ట్ ఫిల్మ్ ‘కిసి కా బాయ్ కిసి  కా జాన్’. పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తోంది. వెంకటేశ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఫర్హాద్ సామ్జీ దర్శకత్వం వహించారు.  ఈనెలలోనే విడుదల కాబోతున్న ఈ చిత్ర ప్రమోషన్స్ ను జోరుగా నిర్వహిస్తున్నారు.  ఇందులో భాగంగా బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అందిస్తున్నారు. ఇప్పటికే చిత్రం నుంచి నాలుగు పాటలు నయియో లగ్డా, బిల్లి బిల్లి, జీ రహే ది హమ్, బతుకమ్మ పాటలు విడుదలై ఆకట్టుకున్నాయి. 

Latest Videos

తాజాగా ‘ఏంటమ్మా.. ఏంటమ్మా’ సాంగ్ విడుదలైంది. ఈ సాంగ్ కు షబ్బీర్ అహ్మద్ హిందీ, తెలుగు భాషలో మిక్స్డ్ గా లిరిక్స్‌ అందించారు. పాటకు పాయల్ దేవ్ క్యాచీ ట్యూన్ కంపోజ్ చేశారు. విశాల్ దద్లానీ, పాయల్ దేవ్ అద్భుతంగా  పాడారు. రాఫ్తార్ ర్యాప్ మ్యూజిక్ ను రాసి పాడారు. ప్రస్తుతం ఈసాంగ్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం 1 మిలియన్ వ్యూస్ వైపు పరిగెడుతోంది. అయితే సాంగ్ లో సల్మాన్ ఖాన్, వెంకటేష్, రామ్ చరణ్ ఎల్లో షర్ట్.. వైట్ లుంగీ ధరించి డాన్స్ అదరగొట్టారు.  అలాగే పూజా హెగ్దే కూడా లుంగీ కట్టి హీరోలతో మాస్ స్టెప్పులేసింది.

RRR తర్వాత రామ్ చరణ్ ను ఈ స్పెషల్ సాంగ్ లో చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. సల్మాన్ - చరణ్ ను ఒకే ఫ్రేమ్ లో చూసి వెండితెరపై దద్దరిల్లిపోతుందంటునన్నారు. ఈసాంగ్ లింక్ లు చరణ్ షేర్ చేశారు. సల్మాన్ ఖాన్, వెంకీ లెజెండ్స్ తో కలిసి పెర్ఫామ్ చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈచిత్రంలో చరణ్ లో గెస్ట్ అపియరెన్స్ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 21న చిత్రం అన్ని భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. షెహనాజ్ గిల్, పాలక్ తివారీలు, జగపతి బాబు, భూమికా చావ్లా, అబ్దు రోజిక్, భాగ్యశ్రీ  కీలక పాత్రల్లో నటిస్తున్నారు.  

One of my most precious on screen moments.
Love you Bhai ❤️

Dancing with these absolute legends... song out now.https://t.co/9gSJhidu0y pic.twitter.com/raRa2zl8Zy

— Ram Charan (@AlwaysRamCharan)
click me!