ప్రభాస్ చిత్రంలో గెస్ట్ గా రాంగోపాల్ వర్మ

Published : Apr 04, 2023, 12:38 PM IST
ప్రభాస్ చిత్రంలో గెస్ట్ గా  రాంగోపాల్ వర్మ

సారాంశం

ఈ సినిమాలో  ఓ గెస్ట్ అప్పియరెన్స్ వేషం ఉందని సమాచారం. దానికి రాంగోపాల్ వర్మ అయితే బాగుంటుందని భావించి వర్మను సంప్రదించడం జరిగిందట.  

రామ్ గోపాల్ వర్మ (RGV) ఏం చేసినా సంచలనమే అవుతూండటం సహజం. వివాదాల దగ్గరినుంచి సినిమాలు చేసే వరకు ప్రతి దాన్ని కూడా అయన అందరు మాట్లాడుకునేలా చేస్తుంటాడు.  తాజాగా ఆయన ప్రభాస్ చిత్రంలో గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నట్లు సమాచారం. ఓ మేరకు ఓ వార్త ఫిల్మ్ సర్కిల్స్ లో సర్కులేట్ అవుతోంది. వివరాల్లోకి వెళితే..

ప్రభాస్ హీరోగా ప్రముఖ దర్శకుడు  మారుతి డైరక్షన్ లో  ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.  ఇప్పటికే దాదాపుగా మారుతీ 45 రోజుల పాటు ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పై మంచి అంచనాలే ఉన్నాయని చెప్పాలి.  ఈ సినిమా కోసం మేకర్స్ అన్నపూర్ణ 7 యాక్టర్స్ స్టూడియోలో ఒక 19వ శతాబ్దానికి చెందిన బిల్డింగ్ సెట్ కూడా నిర్మించి షూట్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరించాడు మారుతి. ఈ సినిమాలో  ఓ గెస్ట్ అప్పియరెన్స్ వేషం ఉందని సమాచారం. దానికి రాంగోపాల్ వర్మ అయితే బాగుంటుందని భావించి వర్మను సంప్రదించడం జరిగిందట.

అందుకు రామ్ గోపాల్  వర్మ ఓకే చెప్పారు. అయితే ఆ పాత్రని రిలీజ్ దాకా రివీల్ చేయకూడదని టీమ్ డిసైడ్ అయ్యిందిట.  వర్మ గెస్ట్ అప్పియరెన్స్ అయినప్పటికీ ప్రేక్షకులకు షాకింగ్ అనే అంటున్నారు. అయితే ఆ గెస్ట్ రోల్ ఏమిటి అన్నది మాత్రం రివీల్ చేయడం లేదు. ఈ చిత్రంలో నిధి అగ‌ర్వాల్‌, మాళ‌వికా మోహ‌న‌న్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. బాలీవుడ్ న‌టుడు సంజ‌య్‌ద‌త్ కీల‌క పాత్ర‌లో న‌టించ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్ర‌భాస్ తాత‌గా సంజ‌య్ ద‌త్‌ క‌నిపించ‌బోతున్న‌ట్లు చెబుతున్నారు. తాతా మ‌న‌వ‌ళ్ల అనుబంధం ఈ సినిమాలో మెయిన్ పాయింట్‌గా ఉంటుంద‌ని తెలిసింది.

ప‌రిమిత బ‌డ్జెట్‌లో పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో ఈసినిమాను రూపొందిస్తున్నారు. రాజా డీల‌క్స్ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ ప‌తాకంపై టీజీ విశ్వ‌ప్ర‌సాద్ నిర్మిస్తున్నారు. ఈ సంవత్సరం చివర్లో  ప్ర‌భాస్‌- మారుతి సినిమాప్రేక్ష‌కుల ముందుకు రానుంది. రాజా డీల‌క్స్‌తో పాటు ప్ర‌భాస్ న‌టించిన ఆదిపురుష్‌, స‌లార్‌, ప్రాజెక్ట్ సినిమాలు కూడా ఈ  ఏడాది రిలీజ్ కానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

ప్రభాస్ ఏకకాలంలో పలు చిత్రాల్లో నటిస్తున్నాడు. ఆదిపురుష్ చిత్రాన్ని పూర్తి చేసాడు. ఇక ఇప్పుడు రాజా డీలక్స్ షూటింగ్ జరుగుతోంది. అలాగే ప్రాజెక్ట్ – K , సలార్ షూటింగ్ లను కూడా ఇదే సమయంలో చేస్తున్నాడు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss 9 Finale Voting : కళ్యాణ్ పడాల , తనూజ మధ్య అసలు పోటీ.., ఫినాలే ఓటింగ్ లో ఎవరు ముందున్నారంటే?
Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ