నాగ చైతన్య ఎఫైర్స్ గురించి నేను మాట్లాడలేదు... సమంత షాకింగ్ పోస్ట్!

Published : Apr 04, 2023, 12:27 PM ISTUpdated : Apr 04, 2023, 12:37 PM IST
నాగ చైతన్య ఎఫైర్స్ గురించి నేను మాట్లాడలేదు... సమంత షాకింగ్ పోస్ట్!

సారాంశం

మాజీ భర్త నాగ చైతన్య ఎఫైర్ రూమర్స్ మీద సమంత స్పందించినట్లు వార్తలు వస్తుండగా ఆమె ఖండించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.

హీరో నాగ చైతన్య యంగ్ హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో డేటింగ్ చేస్తున్నాడనే రూమర్ చాలా కాలంగా ఉంది. నాగ చైతన్య కొత్తగా నిర్మించుకుంటున్న ఇంటికి పలుమార్లు శోభితను తీసుకెళ్లారట. అక్కడ తరచుగా కలుసుకునేవారని కొన్ని నెలల క్రితం కథనాలు వెలువడ్డాయి.  వాటిని నాగ చైతన్య టీమ్ ఖండించింది. ఇవన్నీ ఎవరో కావాలని పుట్టిస్తున్న పుకార్లు అని వివరణ ఇచ్చారు. సద్దుమణిగిన ఈ వ్యవహారం ఇటీవల మరలా తెరపైకి వచ్చింది. లండన్ లోని ఓ రెస్టారెంట్ లో జంటగా ఉన్న చైతు-శోభిత ఫోటో లీకైంది. 

దీంతో పుకార్లు నిజమే... నాగ చైతన్య, శోభిత రిలేషన్ లో ఉన్నారని బలంగా వినిపిస్తోంది. శాకుంతలం చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొంటున్న సమంత ఈ విషయం మీద స్పందించారంటూ ఓ వార్త చక్కర్లు కొడుతోంది. సదరు కథనాల ప్రకారం సమంత..'ఎవరు ఎవరితో రిలేషన్ లో ఉన్నా నాకేం బాధలేదు. మనసు లేని వాళ్ళు ఎందరితో డేటింగ్ చేసిన వాళ్లకు కన్నీళ్లే మిగులుతాయి. కనీసం ఆ అమ్మాయి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా' అని అన్నారట. సమంత పేర్లు చెప్పుకున్నా నాగ చైతన్య, శోభిత రిలేషన్ మీద ఓపెన్ అయ్యారనేది హాట్ టాపిక్. అయితే ఈ వార్తలను సమంత ఖండించారు. 'అసలు ఈ వ్యాఖ్యలు నేను చేయలేదు' అంటూ ట్వీట్ చేశారు. దీంతో పుకార్లకు చెక్ పడింది. 

ఇటీవల మాత్రం సమంత కొన్ని విషయాలపై ఓపెన్ అయ్యారు.  భార్యగా నేను వంద శాతం కరెక్ట్ గా ఉన్నానని చెప్పి మంటలు రేపారు. విడాకులైన కొత్తల్లో పుష్ప మూవీలో ఐటెం సాంగ్ చేసే ఆఫర్ వచ్చింది. దానికి నేను సైన్ చేశాను. బంధువులు, సన్నిహితులు దీన్ని వ్యతిరేకించారు 'ఊ అంటావా మామా' సాంగ్ చేయకని వారించారు. నీకు విడాకులై ఎక్కువ రోజులు కాలేదు. ఈ టైంలో ఐటెం నెంబర్ చేస్తే జనాల్లో తప్పుగా ప్రొజెక్ట్ అవుతావు. ఆ ఆలోచన మానుకో అన్నారు. అయితే నేను వినలేదు. వైవాహిక బంధంలో నేను వంద శాతం నిజాయితీగా ఉన్నాను. అయినా అది వర్క్ అవుట్ కాలేదు. నేను ఏ తప్పు చేయలేదు. అలాంటప్పుడు శిక్ష ఎందుకు అనుభవించాలి. నేనేందుకు దాక్కోవాలి... అంటూ సమంత ఘాటు కామెంట్స్ చేశారు. 

మరోవైపు సమంత లేటెస్ట్ మూవీ శాకుంతలం ఏప్రిల్ 14న విడుదల కానుంది. గుణశేఖర్ దర్శకుడు కాగా దిల్ రాజు నిర్మిస్తున్నారు. సిటాడెల్, ఖుషి చిత్రాల షూటింగ్స్ లో ఆమె పాల్గొంటున్నారు. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఖుషి సెప్టెంబర్ 1న విడుదల కానుంది. శివ నిర్వాణ దర్శకుడు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss 9 Finale Voting : కళ్యాణ్ పడాల , తనూజ మధ్య అసలు పోటీ.., ఫినాలే ఓటింగ్ లో ఎవరు ముందున్నారంటే?
Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ