ఇంకా రిలీజ్ కాని ఈ చిత్రం టీజర్ చూసిన సల్మాన్ ఖాన్ ఫిదా అయ్యపోయారట. వెంటనే రైట్స్ తీసుకునేందుకు ఉత్సాహం చూపించి, దర్శక,నిర్మాతలను సంప్రదించి కథ విన్నారట. అంతేకాకుండా రైట్స్ తీసుకున్నారట. అన్ని కలిసొస్తే రమేష్ వర్మ డైరక్ట్ చేసే అవకాసం ఉందని వినికిడి.
తెలుగు సూపర్ హిట్ రీమేక్ లలో కనిపించటం సల్మాన్ ఖాన్ కు కొత్తేమీ కాదు. పోకిరి,రెడీ,కిక్ వంటి తెలుగు సూపర్ హిట్స్ లో నటించిన సల్మాన్ ఖాన్ ఇప్పుడు మరో రీమేక్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఆ సినిమా మరేదో కాదు ఖిలాడీ. ఇంకా రిలీజ్ కాని ఈ చిత్రం టీజర్ చూసిన సల్మాన్ ఖాన్ ఫిదా అయ్యపోయారట. వెంటనే రైట్స్ తీసుకునేందుకు ఉత్సాహం చూపించి, దర్శక,నిర్మాతలను సంప్రదించి కథ విన్నారట. అంతేకాకుండా రైట్స్ తీసుకున్నారట. అన్ని కలిసొస్తే రమేష్ వర్మ డైరక్ట్ చేసే అవకాసం ఉందని వినికిడి.
ఇక ఖిలాడి విషయానికి వస్తే...మాస్ మహరాజా రవితేజ ఈ ఏడాది 'క్రాక్' మూవీ హిట్ తో జోరు మీద ఉన్నారు. ఈ నేపథ్యంలో వరుస పెట్టి సినిమాలు చేసుకుంటు వెళ్తున్నారు. కరోనా లాక్ డౌన్ తర్వాత థియేటర్స్ తెరచుకోవడంతో.. సగం ఆక్యుపెన్షీతో ఆడియన్స్ థియేటర్స్‌కు వస్తారా రారా? అనే సందేహాలకు పటాపంచలు చేస్తూ.. ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో అదరగొట్టింది. దాంతో రవితేజ చేస్తున్న 'ఖిలాడీ'కు మంచి క్రేజ్ ఏర్పడింది. మరరోసారి రవితేజ..తనదైన మాస్ యాక్షన్ ఎంటర్టేనర్‌తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు.
ఈ చిత్రం ..తమిళంలో అరవింద్ స్వామి, త్రిష జంటగా నటించిన ‘శతురంగ వేట్టై-2’ కథతో తెరకెక్కుతోందని వార్తలు వస్తున్నాయి. గతంలో వచ్చిన ‘శతురంగ వేట్టై’ తమిళంలో సెన్సేషనల్ హిట్టయింది. దీన్నే తెలుగులో ‘బ్లఫ్ మాస్టర్’గా తీశాడు. అలాంటి కథతోనే ‘శతురంగ వేట్టై-2’ తెరకెక్కింది. ఐతే వేరే కారణాల వల్ల ఆ సినిమా కొన్నేళ్లుగా విడుదలకు నోచుకోకుండా ఉంది. ఈ సినిమా రైట్స్ తీసుకున్నారని తెలుస్తోంది. అయితే ఈ విషయం బయిటకు చెప్పటం లేదని టాలీవుడ్ అంటోంది.
ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. దాంతో ఆ పాత్రలు ఎలా వుండనున్నాయనేది ఆసక్తికరంగా మారింది. చిత్రంలో రవితేజ...చార్టర్డ్ అకౌంటెంట్ గా .. ఎన్ ఆర్ ఐ బిజినెస్ మేన్ గా కనిపించనున్నట్టు తెలుస్తోంది. కోనేరు సత్యనారాయణ నిర్మాతగా వ్యవహరించనున్న ఈ సినిమాలో హీరోయిన్స్ గా నిధి అగర్వాల్ .. మాళవిక శర్మ అలరించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.