గేయ రచయిత కందికొండకి మంత్రి కేటీఆర్‌ భరోసా.. తక్షణసాయం

By Aithagoni RajuFirst Published Jun 10, 2021, 1:32 PM IST
Highlights

సినీ గేయ రచయిత కందికొండ సాయం కోసం ప్రాదేయపడగా, ఈ విషయం తెలుసుకున్న మంత్రి కేటీఆర్‌ స్పందించారు. ఆస్పత్రి చికిత్స ఖర్చులు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అందేలా చర్యలు తీసుకున్నారు. 

ప్రముఖ సినీ గేయ రచయిత కందికొండ ఇటీవల అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. ఆయన క్యాన్సర్‌తో బాదపడుతున్నారు. రోజూ రూ.70వేలకుపైగా ఆసుపత్రి ఖర్చులు చెల్లించాల్సి రావడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాయం కోసం అనేక మంది ప్రాదేయపడగా, ఈ విషయం తెలుసుకున్న మంత్రి కేటీఆర్‌ స్పందించారు. అండగా నిలబడేందుకు ముందుకొచ్చాడు. ఆయన ఆస్పత్రి చికిత్స ఖర్చులు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అందేలా చర్యలు తీసుకున్నారు. 

ఈ మేరకు ఆయన చికిత్స వివరాలను ముఖ్యమంత్రి కార్యాలయానికి అందించి రెండు లక్షల 50 వేల రూపాయల సహాయం అందేలా చూశారు. ఈ మేరకు హాస్పిటల్ యాజమాన్యం తో మాట్లాడారు. కందికొండ పాటలు తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు చరిత్రకు అద్దం పట్టేలా ఉంటాయని, ఆయన సాహిత్య సేవ మరింత కాలం కొనసాగేలా ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుంటారని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అభిలషించారు. 

ఉమ్మడి వరంగల్ జిల్లాలో దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన కందికొండ..కష్టపడి చదువుకొని ఉస్మానియా యూనివర్సిటీలో పీ.హచ్. డి పూర్తి చేశారు. తెలంగాణ సంస్కృతి,  సాంప్రదాయాలను, పండుగల విశిష్టతలను, విశేషాలను తెలియజేసే ఎన్నో పాటలని రాశారు కందికొండ గిరి.  జీ.హెచ్. ఎం.సి, తెలంగాణ బోనాల పాట, సమ్మక్క సారక్కల పాట, కాళేశ్వరం పాట, దీపావళి పాట, సంక్రాంతి పాట,  ఎన్నో హిట్ సినిమాలైన `దేశముదురు`, `పోకిరి`, `మున్నా`, `ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం`, `అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి` లాంటి మరెన్నో చిత్రాలలో దాదాపు 1200 పాటలు రాసాడు.

ఆయన ప్రస్తుతం త్రోట్ క్యాన్సర్ వ్యాధితో భాధపడుతున్నారు. గత కొన్ని రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గత 15 రోజుల నుండి అపోలో హస్పిటల్ లో చికిత్స నిమిత్తం అత్యధికంగా వైద్య ఖర్చులైనవి. ఇప్పుడు కిమ్స్ హాస్పిటల్‌లో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉన్నది. వెంటిలెటర్ ఛార్జెస్  రోజుకి రూ. 70,000, మెడిసిన్స్, బెడ్ ఛార్జెస్ అన్ని సపరేటు అని తెలుస్తుంది. తాజాగా మంత్రి కేటీఆర్‌ స్పందించడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. 

click me!