సల్మాన్‌ `రాధే` ట్రైలర్‌ః మహేష్‌, బన్నీ సినిమాల నుంచి కాపీ?

Published : Apr 22, 2021, 01:16 PM IST
సల్మాన్‌ `రాధే` ట్రైలర్‌ః మహేష్‌, బన్నీ సినిమాల నుంచి కాపీ?

సారాంశం

సల్మాన్‌ ఖాన్‌, దిశా పటానీ జంటగా ప్రభుదేవా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా పక్క మాస్‌, కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా సాగుతుందని తాజా ట్రైలర్ ని చూస్తుంటే అర్థమవుతుంది. 

సల్మాన్‌ఖాన్‌ నటిస్తున్న `రాధే` చిత్ర ట్రైలర్‌ విడుదలైంది. ప్రభుదేవా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా పక్క మాస్‌, కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా సాగుతుందని తాజా ట్రైలర్ ని చూస్తుంటే అర్థమవుతుంది. ముంబయిలో అండర్‌ వరల్డ్ మాఫియా కారణంగా నగరంలో శాంతి భద్రతలు క్షీణిస్తాయి. నిత్యం అల్లర్లు జరుగుతుంటాయి. దీంతో వీటిని అరికట్టేందుకు, మాఫియా ఆట కట్టించాలంటే రాధే రావాల్సిందే అని చెప్పడం, గతంలో ఆయన ముంబయిలో మాఫియాని అంతం చేసిన నేపథ్యంలో మరోసారి ఆయన్ని తీసుకురావాలని అనడం, దీంతో మళ్లీ పోలీస్‌ డ్రెస్‌ వేసుకుని విలన్లని రాధే ఎలా మట్టు బెట్టాడు అనేది ఈ చిత్ర కథగా ఉండబోతుందని ట్రైలర్‌ స్పష్టం చేస్తుంది. 

ఇందులో తెలుగు సినిమాల ఛాయలు కనిపించడం విశేషం. `పోకిరి`, `దూకుడు`, `బిజినెస్‌మేన్‌` చిత్ర సీన్లు కనిపిస్తున్నాయి. అంతేకాదు అల్లు అర్జున్‌ నటించిన `డీజే` చిత్రంలోని `సీటీమార్‌..` పాటని యదాతథంగా కాపీ కొట్టడం విశేషం. మొత్తంగా ఇది పక్కా మాస్‌ కమర్షియల్‌ చిత్రంగా, సల్లూభాయ్‌ ఫ్యాన్స్ కి ఫుల్‌ బోనాంజలా ఉండబోతుందని తెలుస్తుంది. ప్రభుదేవా సినిమాని మరో లెవల్‌కి తీసుకెళ్లినట్టు కనిపిస్తుంది. ఇందులో దిశా పటానీ హీరోయిన్‌గా నటిస్తుంది. ఆమె అందాలు సినిమాకి స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా ఉండబోతున్నాయి. 

ఇక ఈ సినిమాని మే 13న ఈద్‌ కానుకగా విడుదల చేయబోతున్నారు. కరోనా విజృంభన నేపథ్యంలో సల్మాన్‌ ఈ సినిమాని మేలో విడుదలకు సిద్ధం చేస్తుండటం విశేషం. థియేటర్లలోనే కాదు ఏకకాలంలోనే ఓటీటీ, డిజిటల్‌లోనూ విడుదల చేయబోతున్నారు. సినిమాకు సంబంధించిన హక్కులను జీ స్టూడియోస్ భారీ రేటుకు దక్కించుకుంది. ఈ సినిమాకు సంబంధించిన ఓవర్సీస్, సాటిలైట్, డిజిటల్, థియేట్రికల్ రైట్స్, మ్యూజిక్ రైట్స్ అన్ని కలిపి రూ. 230 కోట్లకు అమ్ముడుపోయినట్టు తెలుస్తుంది. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

రాజమౌళి తో రెండు సినిమాలు మిస్సైన అన్ లక్కీ స్టార్ హీరో ఎవరో తెలుసా?
యాంకర్ శ్రీముఖికి షాకిచ్చిన స్టార్ మా.. ఆమె షో మరో యాంకర్ చేతిలోకి...