చిరంజీవి అల్లుడు, హీరో కళ్యాణ్‌ దేవ్‌కి కరోనా

Published : Apr 22, 2021, 12:47 PM ISTUpdated : Apr 22, 2021, 12:56 PM IST
చిరంజీవి అల్లుడు, హీరో కళ్యాణ్‌ దేవ్‌కి కరోనా

సారాంశం

చిరంజీవి అల్లుడు, హీరో కళ్యాణ్‌ దేవ్‌కి కరోనా సోకింది. తనకు కొద్దిపాటి లక్షణాలు కనిపించడంతో బుధవారం కోవిడ్‌ 19 టెస్ట్ చేయించుకున్నాడట. తాజాగా పాజిటివ్‌ అని తేలిందని వెల్లడించారు. హాస్పిటల్‌లో క్వారంటైన్‌ అయినట్టు తెలిపాడు.

చిరంజీవి అల్లుడు, హీరో కళ్యాణ్‌ దేవ్‌కి కరోనా సోకింది. తనకు కొద్దిపాటి లక్షణాలు కనిపించడంతో బుధవారం కోవిడ్‌ 19 టెస్ట్ చేయించుకున్నాడట. తాజాగా పాజిటివ్‌ అని తేలిందని వెల్లడించారు. హాస్పిటల్‌లో క్వారంటైన్‌ అయినట్టు తెలిపాడు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని, త్వరలోనే మరింత స్ట్రాంగ్‌గా, ఆరోగ్యంగా తిరిగి వస్తానని తెలిపారు. అభిమానుల ప్రేమకు ధన్యవాదాలు తెలిపారు. 

చిరంజీవి రెండో కూతురు శ్రీజ భర్త కళ్యాణ్‌ దేవ్‌. `విజేత` సినిమాతో హీరోగా టాలీవుడ్‌కి పరిచయం అయ్యాడు. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మిశ్రమ స్పందనని రాబట్టుకుంది. ప్రస్తుతం ఆయన `సూపర్‌ మచ్చి` చిత్రంలో నటిస్తున్నాడు. ఇది విడుదలకు రెడీ అవుతుంది. దీంతోపాటు మరో సినిమా చేస్తున్నాడు.  ఇదిలా ఉంటే ఇప్పటికే మెగా ఫ్యామిలీలో రామ్‌చరణ్‌కి కరోనా సోకింది. ఆయన కోలుకున్నారు. ఇటీవల పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌కి సోకిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నారు.
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Actor Sreenivasan: ప్రముఖ నటుడు, దర్శకుడు శ్రీనివాసన్ కన్నుమూత.. 48 ఏళ్ల సినీ ప్రస్థానానికి ముగింపు
Bigg Boss Telugu 9: చివరి రోజు ఓటింగ్‌ తలక్రిందులు, పక్కా ప్లాన్‌ ప్రకారమే.. టాప్‌లో ఉన్నదెవరంటే?