విలాసవంతమైన అపార్ట్మెంట్ ని అమ్మేసిన సల్మాన్ ఖాన్.. ధర ఎంతో తెలుసా, ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ వైరల్

Published : Jul 17, 2025, 11:43 AM IST
Salman Khan Sells Apartment

సారాంశం

కండల వీరుడు సల్మాన్ ఖాన్ తన విలాసవంతమైన అపార్ట్మెంట్ ని అమ్మేశారు. బాంద్రా వెస్ట్ లో ఉన్న ఈ అపార్ట్మెంట్ భారీ ధర పలికినట్లు తెలుస్తోంది. 

లగ్జరీ అపార్ట్మెంట్ అమ్మేసిన సల్మాన్ ఖాన్ 

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ముంబై బాంద్రాలోని తన విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌ను ఇటీవలే భారీ ధరకు విక్రయించారు. ఇది శివ ఆస్థాన్ హైట్స్, పాలి విలేజ్ ప్రాంతంలోని ప్రీమియం రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ గా ఉంది.  విక్రయమైన ఈ అపార్ట్‌మెంట్‌ సుమారు 1,318 చదరపు అడుగులు విస్తీర్ణంలో , మూడు కార్ పార్కింగ్ స్ధలాలు స్థలాలతో, ఇతర అత్యాధునిక సదుపాయాలతో ఉంది. 

ధర ఎన్ని కోట్లో తెలుసా 

ఈ అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసిన వ్యక్తి రూ.5.35 కోట్లు చెల్లించారు. ఇది భారీ ధర అని చెప్పొచ్చు. ముఖ్యంగా మూడు పార్కింగ్ స్ధలాలు ఉండటమే ఈ అపార్ట్‌మెంట్ విలువను పెంచిందని నిపుణులు చెబుతున్నారు.

ప్రభుత్వ రికార్డుల ప్రకారం, ఈ వ్యవహారంలో స్టాంప్ డ్యూటీగా రూ.32.01 లక్షలు, రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ.30,000 చెల్లించబడ్డాయి. ఈ వివరాలు అధికారికంగా నమోదైనట్లు తెలుస్తోంది.

సల్మాన్ ఖాన్ నివాసం ఉండేది ఎక్కడంటే.. 

ఇదిలా ఉంటే, సల్మాన్ ఖాన్ మాత్రం ఇంకా తన గెలాక్సీ అపార్ట్‌మెంట్స్ లోనే నివాసం కొనసాగిస్తున్నారు. బాంద్రాలోని ఈ అపార్ట్‌మెంట్‌లో ఆయన తన తండ్రి సలీమ్ ఖాన్, తల్లి సల్మా ఖాన్ తో కలిసి ఉంటున్నారు. ఈ ఇంటిపై గతంలో బిష్ణోయ్ గ్యాంగ్ అటాక్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఎవరూ గాయపడలేదు. ఈ గెలాక్సీ అపార్ట్‌మెంట్ 1BHK మాత్రమే అయినప్పటికీ, సల్మాన్ తనకు అదృష్టాన్ని తీసుకువచ్చిందన్న నమ్మకంతో అక్కడే నివసిస్తున్నారు.

ఇదిలా ఉండగా సల్మాన్ ఖాన్ తాజా సినిమా 'గల్వాన్' ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈ సినిమా చైనా‌తో జరిగిన ఘర్షణ ఆధారంగా తెరకెక్కుతోంది. హీరోయిన్‌గా చిత్రాంగదా సింగ్ నటిస్తున్నారు. సినిమా సంబంధిత మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Karthika Deepam 2 Latest Episode: జ్యోకు చెమటలు పట్టించిన కాశీ- జ్యో ఆ ఇంటి బిడ్డ కాదన్న శ్రీధర్
Rashmi Gautam: కోరుకున్నవాడితోనే రష్మి పెళ్లి.. ఎట్టకేలకు కన్ఫమ్‌ చేసిన జబర్దస్త్ యాంకర్‌