
ప్రభాస్(Prabhas) ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలు చూస్తుంటే రానున్న రోజుల్లో ఆయన గ్లోబల్ స్టార్ అవ్వడం ఖాయం. ప్రస్తుతం ఆయన మూడు భారీ సినిమాలు చేస్తున్నారు. మరో రెండు సినిమాలు ప్రారంభం కావాల్సి ఉంది. ఇలా ఆయన చేతిలో ఐదు ప్రాజెక్ట్ లు ఉండగా, మరో సినిమాకి కమిట్ అయ్యాడు ప్రభాస్. బాలీవుడ్ దర్శకుడితో సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే ఇది కొన్ని రోజులుగా రూమర్స్ గా వినిపించగా, ఇప్పుడు అఫీషియల్‌గానే కన్ఫమ్ అయినట్టు సమాచారం.
ప్రభాస్ ఇప్పటికే బాలీవుడ్‌లో `ఆదిపురుష్`(Adipurush) చిత్రం చేస్తున్నారు. ఇది స్ట్రెయిట్ బాలీవుడ్ చిత్రం. ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. దీన్ని హిందీతోపాటు తెలుగులోనూ రూపొందించారు. పాన్ ఇండియా చిత్రంగా విడుదల చేయబోతున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్, సీజీ వర్క్ జరుపుకుంటోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. అక్టోబర్ నుంచి ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ చేయనున్నారు.
ప్రస్తుతం ప్రభాస్ `సలార్`(Salaar), `ప్రాజెక్ట్ కే`(Project k) చిత్రాల షూటింగ్‌లో పాల్గొంటున్నారు. బ్యాక్ టూ బ్యాక్ ఈ రెండు భారీ చిత్రాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు. మరోవైపు అక్టోబర్ నుంచి మారుతి దర్శకత్వంలో చేయబోయే మాస్ ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రాన్ని ప్రారంభించనున్నారు. ఆ చిత్రాన్ని మూడు నెలల్లోనే కంప్లీట్ చేయాలని భావిస్తున్నారు. అనంతరం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో సినిమా చేయనున్నారు ప్రభాస్. `స్పిరిట్` పేరుతో ఈచిత్రం రూపొందనుంది. ఇది మరో భారీ పాన్ ఇండియా సినిమా కాబోతుంది.
దీంతోపాటు ప్రభాస్ గతేడాది నుంచి బాలీవుడ్‌లో సిద్ధార్థ్ ఆనంద్(Siddharth anand)తో ఓ సినిమా చేసే అవకాశం ఉందని వార్తలు వినిపించాయి. అవి ఇప్పటి వరకు రూమర్స్ గానే వినిపించగా, తాజాగా కన్ఫమ్ అయినట్టు సమాచారం. ఈ చిత్రాన్ని దిల్‌రాజు నిర్మిస్తారని వినిపించింది, కానీ మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్ ని చేయబోతుందని తెలుస్తుంది. ఆల్మోస్ట్ ఈ కాంబినేషన్ ఫైనల్ అయ్యిందని, వచ్చే ఏడాది ద్వితీయార్థంలో సినిమాని ప్రారంభించబోతున్నట్టు నిర్మాణ సంస్థ వర్గాల నుంచి వినిపిస్తున్న టాక్.
ప్రస్తుతం సిద్ధార్థ్ ఆనంద్.. బాలీవుడ్ లో షారూఖ్ ఖాన్‌తో `పఠాన్` చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దీంతోపాటు హృతిక్ రోషన్‌తో `ఫైటర్` సినిమాని చేస్తున్నారు. ఈ రెండు చిత్రాలు పూర్తయ్యాక ప్రభాస్ సినిమాని స్టార్ట్ చేయబోతున్నారట. తెలుగు, హిందీలో ప్రభాస్ సినిమా తెరకెక్కించి పాన్ ఇండియా లెవల్‌లో విడుదల చేయబోతున్నారు. ఇది ఆద్యంతం యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా సాగబోతుందని సమాచారం.