స్టెరాయిడ్ డోస్ ఎక్కువై, స్టార్ హీరో బాడీ గార్డ్ ఏం చేశాడంటే..?

By AN TeluguFirst Published Sep 27, 2019, 4:25 PM IST
Highlights

వివరాల్లోకి వెళితే...ముంబైలో బౌన్సర్‌గా పనిచేసే అనాజ్ ఖురేషి పది రోజుల క్రితం తన సొంత ఊరు మొరాదాబాద్‌కు వచ్చాడు. అక్కడ లోకల్ గా  జరిగిన మిస్టర్ మొరాదాబాద్ బాడీబిల్డింగ్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్నాడు. 

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ వద్ద గతంలో బాడీగార్డ్‌గా పనిచేసిన ఓ బాడీ బిల్డర్... స్టెరాయిడ్ల డోసేజ్ పెరిగిపోవడంతో తానేం చేస్తున్నాడో విచక్షణా జ్ఞానం కోల్పోయి...మతిస్థిమితం కోల్పోయిన వాడిలా తిరుగతూ విధ్వంసం సృష్టించాడు. యుపిలోని మొరాదాబాద్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే...ముంబైలో బౌన్సర్‌గా పనిచేసే అనాజ్ ఖురేషి పది రోజుల క్రితం తన సొంత ఊరు మొరాదాబాద్‌కు వచ్చాడు. అక్కడ లోకల్ గా  జరిగిన మిస్టర్ మొరాదాబాద్ బాడీబిల్డింగ్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొన్నాడు. అయితే అయితే అతనికి ఫస్ట్ రన్నర్‌అప్ టైటిల్ దక్కింది. తనకు బాడీబిల్డింగ్ టైటిల్ దక్కకపోవడంతో నిస్పృహకు గురైన ఖురేషి బుధవారం సాయంత్రం స్టెరాయిడ్లు ఓవర్‌డోస్ తీసుకుని జిమ్‌కు వెళ్లాడు. బాగా వ్యాయామం చేసిన తర్వాత ఇంటికి వచ్చి పడుకున్నాడు.

తెల్లారి నిద్రలేచింతర్వాత స్టెరాయిడ్ల దుష్ప్రభావం కారణంగా అతను విచక్షణను కోల్పోయాడు. పిచ్చిపట్టినవాడిలో చొక్కాలేకుండానే రోడ్డు మీదకు వచ్చి ఎదురుగా కనిపించిన కారును ఇనుప రాడ్డుతో ధ్వంసం చేయటం మొదలెట్టాడు. అంతేకాదు ఎదురు వచ్చిన వారిని చితకబాదాడు.

వాహనాలపై ఇటుక రాళ్లతో దాడి చేశాడు. అతడిని  ఆపటం స్థానికులకు సాధ్యం కాకపోవడంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. వలలు వేసి అతడిని బంధించి జిల్లా ఆసుపత్రికి తరలించారు.డాక్టర్స్ సలహా మేరకు అతడిని బరేలీలోని మానసిక చికిత్సా కేంద్రానికి తరలించారు.  ఇప్పుడు అనాజ్ ఖురేషి హ‌ల్‌చ‌ల్‌ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

click me!