సల్మాన్‌ ఖాన్‌పై చిన్న పిల్లల అక్రమ ఆరోపణలు.. బాలీవుడ్‌లో దుమారం

Published : Jan 23, 2022, 04:02 PM IST
సల్మాన్‌ ఖాన్‌పై చిన్న పిల్లల అక్రమ ఆరోపణలు.. బాలీవుడ్‌లో దుమారం

సారాంశం

సల్మాన్‌ఖాన్‌పై సెలబ్రిటీల శవాల ఆరోపణలు, చిన్న పిల్లల అక్రమ రవాణా ఆరోపణలు వచ్చాయి. దీంతో ఇది బాలీవుడ్‌లో తీవ్ర కలకలం రేపుతుంది. బాలీవుడ్‌లో అగ్ర హీరోగా రాణిస్తున్న సల్మాన్‌పై ఇలాంటి ఆరోపణలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌(Salma Khan) మరో వివాదంలో ఇరుక్కున్నారు. ఇప్పుడాయనపై సెలబ్రిటీల శవాల ఆరోపణలు, చిన్న పిల్లల అక్రమ రవాణా ఆరోపణలు వచ్చాయి. దీంతో ఇది బాలీవుడ్‌లో తీవ్ర కలకలం రేపుతుంది. బాలీవుడ్‌లో అగ్ర హీరోగా రాణిస్తున్న సల్మాన్‌పై ఇలాంటి ఆరోపణలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. 

Salman Khanపై కేతన్‌ కక్కడ్‌ అనే వ్యక్తి ఈ సంచలన ఆరోపణలు చేశారు. ఓ యూట్యూబ్‌ చానెల్‌లో మాట్లాడుతూ, పన్వేల్‌లోని సల్మాన్‌ ఖాన్‌ ఫామ్‌ హౌజ్‌లో సినీ సెలబ్రిటీల శవాలను ఖననం చేశారని, అంతేకాదు సల్మాన్‌పై చిన్న పిల్లల అక్రమ రవాణా ఆరోపణలు కూడా ఉన్నాయని ఆయన ఆరోపించారు. దీంతో ఇప్పుడీ ఆరోపణలు సంచలనంగా మారాయి. కృష్ణ జింకలను వేటాడే కేసు నుంచి బయటపడ్డ ఆయన ఇప్పుడు ప్రశంతంగా సినిమా కెరీర్‌పై ఫోకస్‌ పెట్టి పూర్తిగా సినిమాలకే పరిమితమయ్యారు సల్మాన్‌. ఇలాంటి క్రమంలో ఆయనపై ఇంతటి సంచలన ఆరోపణలు రావడం బాలీవుడ్‌ వర్గాలను షాక్‌కి గురి చేస్తుంది. 

అయితే ఈ ఆరోపణలు చేసిన కేతన్‌ కక్కడ్‌ అనే వ్యక్తిపై సల్మాన్‌ ఖాన్‌ కోర్ట్ లో పరువు నష్టం దావా వేశాడు. ఈ కేసుకి సంబంధించి ముంబయి కోర్టులో సల్మాన్ తరఫు న్యాయవాది ప్రదీప్ గాంధీ వాదనలు వినిపిస్తూ.. సల్మాన్ ఖాన్ కు చెందిన పన్వేల్ ఫాంహౌస్లో సినీ తారల శవాలను పాతిపెడుతున్నారంటూ కేతన్ కక్కడ్ అసత్య ఆరోపణలు చేశాడని తెలిపారు. పిల్లల అక్రమ రవాణా ఆరోపణలు కల్పితాలని, అలాంటివేవీ లేవని  సల్మాన్ న్యాయవాది కోర్టుకు వివరించాడు. 

అయితే ఓ ఆస్తి వివాదానికి సంబంధించిన వివాదమని, అందుకోసం సల్మాన్ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు సదరు వ్యక్తి ప్రయత్నిస్తున్నారని తెలియజేశాడు. సల్మాన్ ఖాన్ తన పరువునష్టం దావాలో గూగుల్, యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్ల పేర్లను కూడా పేర్కొన్నాడు. ఆయా సామాజిక మాధ్యమాలు కేతన్ కక్కడ్ ఇంటర్వ్యూ వీడియోలను తొలగించాలని సల్మాన్ తరపు న్యాయవాది కోర్టును కోరాడు. 

ఇటీవల `అంతిమ్‌` చిత్రంతో మెప్పించిన సల్మాన్‌ ప్రస్తుతం `టైగర్‌ 3`, `అఖం మిచోలి` చిత్రాల్లో నటిస్తున్నారు. దీంతోపాటు అమిర్‌ ఖాన్‌, నాగచైతన్య నటిస్తున్న `లాల్‌ సింగ్‌ చద్దా`లో గెస్ట్ గా, షారూఖ్‌ ఖాన్‌ `పఠాన్‌`లో ఎక్స్ టెండెడ్‌ కొమియోగా కనిపించబోతున్నారు సల్మాన్. దీంతోపాటు చిరంజీవి హీరోగా రూపొందుతున్న `గాడ్‌ ఫాదర్` చిత్రంలోనూ కీలక పాత్రలో సల్మాన్‌ కనిపించబోతున్నారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Chiranjeevi, Mahesh Babu సినిమాలతో పోటీ పడి టాప్ 5లో నిలిచిన హీరో, టాలీవుడ్ రాజకీయాలపై ఓపెన్ కామెంట్స్
Thalapathy Vijay సినిమా స్టోరీ లీక్, జన నాయగన్ కథ ఇదేనా? షాక్ లో మూవీ టీమ్