Bheemla nayak: పవన్ గురించి మాట్లాడిన తమన్‌, ఫ్యాన్స్ రియాక్షన్

Surya Prakash   | Asianet News
Published : Jan 23, 2022, 03:19 PM IST
Bheemla nayak: పవన్ గురించి మాట్లాడిన తమన్‌,  ఫ్యాన్స్ రియాక్షన్

సారాంశం

ఈ సినిమాని ఫిబ్రవరి 25 వ తారీఖున విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అప్పటికి భారత దేశంలో కరోనా కేసులు తగ్గుతాయని నమ్ముతోంది చిత్ర బృందం. మలయాళంలో సూపర్ హిట్ అయిన "అయ్యప్పనుమ్ కోషియుమ్" సినిమాకి రీమేక్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో రానా కూడా హీరోగా నటిస్తున్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌(Pawan Kalyan) హీరోగా నటిస్తున్న "భీమ్లా నాయక్"(Bheemla Nayak) సినిమాపై ఓ రేంజిలో ఎక్సపెక్టేషన్స్ ఉన్న సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈ సినిమా జనవరి 12న సంక్రాంతి సందర్భంగా విడుదల కావాల్సి ఉంది. కానీ అప్పటికే "ఆర్ఆర్ఆర్", "రాధే శ్యామ్" వంటి భారీ బడ్జెట్ చిత్రాలు సంక్రాంతి బరిలో ఉండగా ఈ సినిమా విడుదలను కూడా వాయిదా వేశారు. దీంతో సినిమా పనులను మెల్లగా జరుగుతున్నాయి. ఇంకా ఈ సినిమా షూటింగ్ కి సంబంధించిన కొన్ని పోర్షన్ లు మిగిలి ఉన్నాయని సమాచారం. ఈ నేపధ్యంలో సినిమా ఎలా వచ్చిందనేది మీడియా వర్గాల్లోనే కాదు...అభిమానుల్లోనూ హాట్ టాపిక్ గా మారింది.  ‘భీమ్లా నాయక్’ సినిమా గురించి సంగీత దర్శకుడు థమన్ ఓ ఇంటర్వూలో  రివీల్ చేసారు.

తమన్  స్పందిస్తూ..‘‘త్రివిక్రమ్‌గారు నేను ఇటీవల ‘భీమ్లానాయక్‌’ రఫ్‌ ఫుటేజీ చూశాను. ఆ సినిమాలో Pawan Kalyan యాక్షన్‌ నాకు బాగా నచ్చేసింది. పవన్‌ కెరీర్‌లోనే ఇది బెస్ట్ మూవీ అవుతుందని భావిస్తున్నా. ఈ సినిమా కోసం నా వరకూ నేను ది బెస్ట్‌ మ్యూజిక్‌ అందించడానికి ప్రయత్నించాను’’ అని తమన్‌ తెలిపారు. ఇది విన్న పవన్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

 ఈ సినిమాని ఫిబ్రవరి 25 వ తారీఖున విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అప్పటికి భారత దేశంలో కరోనా కేసులు తగ్గుతాయని నమ్ముతోంది చిత్ర బృందం. మలయాళంలో సూపర్ హిట్ అయిన "అయ్యప్పనుమ్ కోషియుమ్" సినిమాకి రీమేక్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో రానా కూడా హీరోగా నటిస్తున్నారు. సినిమా కథ మొత్తం పవన్ కళ్యాణ్ మరియు రానా పాత్రల చుట్టూ తిరుగుతుంది.
 
మలయాళంలో విజయవంతమైన ‘అయ్యప్పనుమ్‌ కోశియుమ్‌’ చిత్రానికి రీమేక్‌గా ‘భీమ్లా నాయక్‌’ రూపొందుతోంది. నిత్యా మేనన్‌, సంయుక్త మేనన్‌ హీరోయిన్స్. దర్శకుడు త్రివిక్రమ్‌ మాటలు రాస్తున్న ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మిస్తోంది.

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

అఖండ-2లో బాలయ్య కూతురిగా ఫస్ట్ ఛాయస్ స్టార్ హీరో కూతురట.. ఆమె ఎవరో తెలుసా.?
Jinn Movie Review: జిన్‌ మూవీ రివ్యూ.. హర్రర్‌ సినిమాల్లో ఇది వేరే లెవల్‌