భారీ భద్రత నడుమ హైదరాబాద్ లో అడుగు పెట్టిన సల్మాన్ ఖాన్, దేనికి వచ్చినట్టు..?

Published : Jun 08, 2022, 01:03 PM IST
భారీ భద్రత నడుమ హైదరాబాద్ లో అడుగు పెట్టిన సల్మాన్ ఖాన్,  దేనికి వచ్చినట్టు..?

సారాంశం

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హైదరాబాద్ వచ్చారు. అది కూడా భారీ బందోబస్త్ నడుమఆయన భగ్యనగరం చేరాడు. గుర్తుతెలియని వ్యక్తులు బెదిరించడంలో సల్మాణ్ విషయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇటువంటిపరిస్థితుల్లో ఆయన హైదరాబాద్ ఎందుకు వచ్చారు. 


బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హైదరాబాద్ వచ్చారుతన తాజా మూవీ కబీ ఈద్ కబీ దివాలి సినిమా షూటింగ్ కోసం బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ హైదరాబాదుకు వచ్చారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఆయన చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. ఈ క్రమంలో, గతంలో ఎన్నడూ లేనంత భద్రతతో ఆయన హైదరాబాద్ లో అడుగుపెట్టారు. సల్మాన్ ను చంపుతామంటూ బెదిరింపులు రావడంతో ఆయనకు సెక్యూరిటీ పెంచారు. అయితే సల్మాన్ తన సినిమా షూటింగ్స్ కోసం పలు ప్రదేశాలకు వెళ్ళాల్సి వస్తుంది. అయితే ఎక్కడికి వెళ్ళినా..  సల్మాన్ వెంట ఈ సెక్యూరిటీ ఫాలో అవ్వనుంది. 

కాగా   పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలాకు పట్టిన గతే సల్మాన్ కు అతని తండ్రి  సలీమ్ ఖాన్ కు త్వరలోనే పడుతుందని  హెచ్చరిస్తూ... లేఖను గుర్తు తెలియని వ్యక్తులు పంపించిన నేపథ్యంలో సల్మాన్ ఖాన్ భద్రతను మరింత పటిష్ఠం చేస్తూ మహారాష్ట్ర సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది.  సల్మాన్ కు ఆయన కుటుంబానికి బారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర సర్కారు వారికి కట్టుదిట్టమైన భద్రత కల్పించింది. ముంబై పోలీసులు సల్మాన్ ఇంటి వద్ద కూడా భద్రతను పెంచారు. 

తుమ్హారా మూసే వాలా కర్ దేంగే అని సదరు లేఖలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అందులో రాసిన వారు పేరు కానీ, సంతకం కానీ లేవు. సల్మాన్ ఖాన్ రోజూ వాకింగ్ చేసే ప్రాంతంలో బల్లపై కూర్చుంటారు. దానిపైనే ఆగంతుకులు లేఖను వదిలి వెళ్లారు. తన సెక్యూరిటీ గార్డుల ద్వారా పోలీసులకు సల్మాన్ సమాచారం ఇచ్చారు. దీనిపై పోలీసులు కేసు  నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

కాగా పంజాబీ సింగర్, కాంగ్రెస్  నేత సిద్ధూ మూసేవాలా హత్య కేసులో  ప్రధాన నిందితుడు గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్టోయ్‌  అన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే లారెన్స్ గతంలో సల్మాన్ ఖాన్ గురించి మాట్లాడిన ఒక వీడియో మరోసారి తెరపైకి వచ్చింది. 2018 లో ఒక కేసులో లారెన్స్‌ బిష్ణోయ్‌తో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన అతడి అనుచరులకు ఢిల్లీ హైకోర్డు రిమాండ్ విధించింది. అప్పుడు మీడియా ముందు లారెన్స్ మాట్లాడుతూ.. ప్రస్తుతం తాను ఏం చేయలేదని... కానీ, తాను ఏమి చేయగలనో, ఏం చేస్తానో అప్పుడే మీకు తెలుస్తుంది. రాజస్థాన్‌లో సల్మాన్‌ ఖాన్‌ను చంపేస్తాను... మీరేం చేస్తారో అప్పుడు చూస్తా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. 

అప్పట్లో ఈ వార్త సంచలనం సృష్టించింది.. అప్పటినుంచి పోలీసులు  ఈ ముఠాపై నిఘా పెట్టారు. మధ్యలో సల్మాన్ ఇంటిపై రెక్కీ నిర్వహించిన ఈ ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. తాజాగా మూసేవాలా దారుణ హత్య నేపథ్యంలో లారెన్స్ బిష్ణోయ్ వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. తాజాగా సల్మాన్‌కు బెదిరింపు లేఖ నేపథ్యంలో ఆయనకు పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. 

PREV
click me!

Recommended Stories

ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?
Bigg Boss 9 Remuneration పేదలకు పంచి పెట్టిన ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్, నెటిజన్లు ఏమంటున్నారంటే?