భారతీయ రుచులు ఆస్వాదించిన జానీ డెప్, ఇండియన్ రెస్టారెంట్ లో గ్రాండ్ పార్టీ, బిల్లు ఎన్ని లక్షలో తెలుసా..?

Published : Jun 08, 2022, 10:29 AM ISTUpdated : Jun 08, 2022, 01:10 PM IST
భారతీయ రుచులు ఆస్వాదించిన జానీ డెప్, ఇండియన్  రెస్టారెంట్ లో గ్రాండ్ పార్టీ, బిల్లు ఎన్ని లక్షలో తెలుసా..?

సారాంశం

అనుభవించురాజా..అంటూ.. ఫుల్ జోష్ మీద ఉన్నాడు హాలీవుడ్ హీరో జానీడెప్. తనను హింసిస్తున్న మాజీ భార్యపై కేసు గెలిచిన ఆనందాన్ని ఇండియన్ రెస్టారెంట్ లో గ్రాండ్ పార్టీ ద్వారా సెలబ్రేట్ చేసుకున్నాడు.   

హాలీవుడ్ స్టార్ జానీడెప్ రీసెంట్ గా  తన మాజీ భార్యపై పరువు నష్టం దావాలో గెలిచాడు. ఆ ఆనందంలో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. ఇప్పటికే పలు సంగీత పర్యటనలతో బిజీగా గడుపుతున్న జానీ... గిటారిస్ట్ జెఫ్ బెక్ తో కలసి బ్రిటన్ లో దర్శనమిచ్చాడు.  అంత కాదు ఇండియన్ రెస్టారెంట్ కు వెళ్లి. .. అక్కడ భారతీయ రుచులను ఆస్వాదించాడు. 

 

ఈ క్రమంలో బర్మింగ్ హామ్ లో జానీ డెప్ ఓ భారతీయ రెస్టా రెంట్ కు వెళ్ళాడు. అక్కడ  భారత వంటకాలను రుచి చూడడమే కాదు.. భారీ మొత్తంలో బిల్లు కూడా చేశాడు.  బ్రిటన్ పర్యటనలో ఉన్న జానీడెప్ తన బృందంతో కలసి జూన్ 5న బర్మింగ్ హామ్ లోని వారణాసి రెస్టారెంట్ కు వెళ్లాడు. బటర్ చికెన్, పన్నీర్ టిక్కా మసాలా, లాంబ్ కరాచి, కింగ్ ప్రావన్ భూన, రైస్ లాంటి ఫేమస్ ఇండియన్ ఫుడ్ ను  రుచి చూశారు. సాయంత్రం 7 గంటల సమయంలో రెస్టారెంట్ కు వచ్చిన వారు ముందు కాక్ టెయిల్ పార్టీ చేసుకున్నారు. ఆ తర్వాత భారత వంటకాల పని పట్టారు. 

అంతే కాదు డిన్నర్ ముగిసిన తర్వాత ఇక్కడ పనిచేస్తున్న ఇండియన్ ఎప్లాయిస్ కు ఫోటో గ్రాఫ్ లు కూడా ఇచ్చాడు. అక్కడి వారితో ఎంతో ప్రేమగా మాట్లాడారు జానీ డెప్. ఇక ఆయన అక్కడ ఉన్నందుకు, తిన్నందుకు టోటల్ గా ఎంత బిల్ చెల్లించారో తెలుసా..  50,000 పౌండ్లు. అంటే  భారత కరెన్సీలో అక్షరాలా  49 లక్షలు. వారణాసి రెస్టారెంట్ ఆపరేషన్స్ డైరెక్టర్ మహమ్మద్ హుస్సేన్ దీనిపై స్పందించారు.  జానీ డెప్ రెస్టారెంట్ కు వచ్చిన వివరాలను ఆయన వెల్లడించాడు. 

ఆదివారం మధ్యాహ్నం మాకు ఒక కాల్ వచ్చింది. డెప్ మా రెస్టారెంట్ కు రావాలనుకుంటున్నట్టు చెప్పారు. నేను షాక్ అయ్యాను. కానీ, అతడి సెక్యూరిటీ బృందం వచ్చి రెస్టారెంట్ ను చెక్ చేసింది. దీంతో డెప్ బృందానికి విశాలమైన ప్రదేశాన్ని విడిచి పెట్టాం అని వివరించాడు. డెప్ తమ రెస్టారెంట్ కు రావడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ వారణాసి రెస్టారెంట్స్ తన  ఇన్ స్టా గ్రామ్ పేజీలో పోస్ట్ పెట్టింది.

PREV
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?