సల్మాన్ ఖాన్ గ్యారేజ్ లో అదిరిపోయే కొత్త కారు, కాస్ట్ తెలిస్తే కళ్లు తిరగాల్సిందే.

Published : Jun 22, 2025, 11:54 AM IST
salman khan buys new bulletproof suv here is his full car collection

సారాంశం

సినిమా సెలబ్రిటీలు వాడే కార్లు ఎప్పుడు వైరల్ న్యూస్ అవుతూనే ఉంటాయి. హీరోలు కొత్త కార్లు కొన్నారంటే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేయాల్సిందే. ఈక్రమంలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కొత్త కారు కొన్నారు. ఇంతకీ కాస్ట్ ఎంతో తెలుసా?

బాలీవుడ్ ను ఏలుతున్న స్టార్ హీరోలలో సల్మాన్ ఖాన్ పేరు ముందు వరుసలో ఉంటుంది. సినిమాల్లో హీరోయిజం చూపించడం మాత్రమే కాదు 60 ఏళ్లు వస్తున్నా.. ఏమాత్రం తగ్గకుండా అదే ఫిట్ నెస్ తో,  స్టైలిష్ లుక్స్ ఫ్యాన్స్ ను అలరిస్తున్నాడు. అంతే కాదు కాస్ట్లీ లైఫ్ స్టైల్ తో ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తుంటాడు సల్మాన్ ఖాన్.

కొత్త కారు కొన్న సల్మాన్ ఖాన్

సల్మాన్ ఖాన్ వాడే వస్తువులు, కార్లు అన్నీ కోట్లలోనే ఉంటాయి. ఇప్పటికే ఆయన గ్యారేజ్ లో విలువైన కార్లు బోలెడు ఉండగా.. తాజాగా అందులోకి మరో కాస్ట్లీ కారు వచ్చి చేరింది. అవును రీసెంట్ గా సల్మాన్ ఖాన్ తన లగ్జరీ కార్ల కలెక్షన్‌లోకి మరో ఖరీదైన కారును చేర్చారు. అదే మెర్సిడెస్-మేబాచ్ GLS 600 SUV.

ఈ లగ్జరీ కారులో సల్మాన్ ఖాన్ ఫ్రంట్ ప్యాసింజర్ సీట్లో కూర్చుని బయటకి వస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఫ్యాన్స్ గమనించిన మరో ప్రత్యేకత కూడా ఉంది. అదేంటంటే కారుపై ఉన్న 2024 రిజిస్ట్రేషన్ స్టిక్కర్. దీని ద్వారా ఇది రీసెంట్ గానే రిజిస్టర్ చేయబడినది గా తెలుస్తోంది.

 

 

సల్మాన్ ఖాన్ కారు కాస్ట్ ఎంతంటే?

మెర్సిడెస్-మేబాచ్ GLS 600 SUV బేస్ వేరియంట్ ధర రూ.3.39 కోట్లుగా ఉంది. ఇది ఎక్స్-షోరూమ్ ప్రైస్ మాత్రమే. ఇతర కస్టమైజేషన్, బుల్లెట్ ప్రూఫ్ ఫీచర్లు కలిపితే దీని ధర రూ.5 కోట్లకు పైగా ఉండవచ్చని అంచనా. గతంలో సల్మాన్ ఖాన్‌కు హత్య బెదిరింపులు వచ్చిన నేపథ్యాన్ని గుర్తు చేసుకుంటే, ఈ కారులో బుల్లెట్ ప్రూఫ్ సౌకర్యాలు ఉండే అవకాశం ఉంది అని అభిమానులు అంటున్నారు.

ఈ లగ్జరీ SUV సల్మాన్ ఖాన్  వ్యక్తిత్వానికి తగ్గట్టుగా బోల్డ్ డిజైన్, శక్తివంతమైన ఇంజిన్, సూపీరియర్ ఇంటీరియర్ ఫీచర్లతో ఆకర్షణీయంగా ఉంది. సల్మాన్ ఖాన్ ఎప్పటికప్పుడు తన లైఫ్ స్టైల్ తో అభిమానులను ఆకట్టుకుంటుంటారు. కొత్త కొత్త మెరుపులతో అలరిస్తుంటారు. ఈక్రమంలో మెర్సిడెస్ మేబాచ్ GLS 600 కారుతో మరోసారి చర్చనీయాంశం అయ్యారు సల్మాన్.

ఇది సల్మాన్ ఖాన్ కలెక్షన్‌లో ఉన్న తొలి విలాసవంతమైన కారు కాదు. ఇప్పటికే ఆయన దగ్గర కాస్ట్లీ కార్లు చాలా ఉన్నాయి.

రేంజ్ రోవర్ SC LWB 3.0

టయోటా ల్యాండ్ క్రూయిజర్ LC200

మెర్సిడెస్-బెంజ్ GL

ఆడి RS7

బుల్లెట్ ప్రూఫ్ నిస్సాన్ పెట్రోల్

ఆడి A8L

ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వోగ్

మెర్సిడెస్-బెంజ్ AMG GLE కూపే

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 Elimination: బిగ్‌ బాస్‌ ఎలిమినేషన్‌లో బిగ్‌ ట్విస్ట్.. 13 వారం ఈ కంటెస్టెంట్ ఔట్‌
Nagarjuna తో పోటీకి దిగి.. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అల్లరి నరేష్, ఇంతకీ ఆమూవీ ఏదో తెలుసా?