
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ తన ప్రతి సినిమాలోనూ కండలను ప్రదర్శిస్తుంటాడు. తన శరీర సౌష్టవం అలాంటిది. అతను షర్ట్ విప్పని సినిమా లేదంటే అతిశయోక్తి కాదు. సల్లూ భాయ్ కి 52 ఏళ్లు వచ్చినా కండల వీరుడు అని పిలిపించుకుంటున్నాడు. సల్మాన్ ఫిట్‌నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పలు సినిమాల్లో ఆయన కండలు తిరిగి ఉండటమే కాదు... సిక్స్ ప్యాక్స్‌తో అమ్మాయిల మనసు దోచుకుంటున్నాడు. కానీ, ఆ సిక్స్ ప్యాక్స్ నిజం కాదంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
సల్మాన్ కండల వీడియోపై ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. ఇదిగో సల్మాన్ ఖాన్ యాబ్స్ నిజమైనవి కావని, అవి విజువల్ ఎఫెక్ట్ ద్వారా చేసినవంటూ ఓ వీడియో ట్విట్టర్లో చక్కర్లు కొడుతోంది. ‘ఏక్ థా టైగర్’ సినిమాలోని ఈ సీన్‌ను ఎఫెక్ట్స్ వీడియోను ఆ సినిమా యూనిట్ విడుదల చేసిందని సాహిల్ రిజ్వాన్ అనే వ్యక్తి ట్వీట్ చేశాడు. అయితే, ఈ పొరపాటున గుర్తించిన సినిమా యూనిట్ ఆ వీడియో నుంచి తొలగించిందని రిజ్వాన్ తెలిపాడు. ఆ వీడియోను ఇక్కడ చూడొచ్చు.