'మహర్షి' సెకండ్ సాంగ్ వచ్చేసింది..!

Published : Apr 12, 2019, 04:57 PM IST
'మహర్షి' సెకండ్ సాంగ్ వచ్చేసింది..!

సారాంశం

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న 'మహర్షి' సినిమా నుండి ఇప్పటికే ఒక పాటను విడుదల చేశారు. 

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న 'మహర్షి' సినిమా నుండి ఇప్పటికే ఒక పాటను విడుదల చేశారు. దానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్వచ్చింది. ఇప్పుడు చిత్రబృందం రెండో పాటను విడుదల చేసింది. 

'నువ్వే సమస్తం.. నువ్వే సిద్ధాంతం' అంటూ సాగే లిరికల్ సాంగ్ ని విడుదల చేశారు. ఈ వీడియోలో మహేష్ బాబు బిజినెస్ మెన్ లా హెలికాఫ్టర్ నుండి దిగి స్టైల్ గా నడుచుకుంటూ రావడం హైలైట్ గా నిలిచింది. శ్రీమణి రచించిన ఈ పాటను యాజిన్ నిజార్ ఆలపించారు.

దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. మహేష్ కి స్నేహితుడిగా అల్లరి నరేష్ కనిపించనున్నారు.

దిల్ రాజు, అశ్వనీదత్, పివిపి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాను మే 9న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 

 

PREV
click me!

Recommended Stories

Dhurandhar vs Avatar 3: అవతార్ 3కి చుక్కలు చూపించిన ధురంధర్.. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లు
బాహుబలి కంటే ముందు రమ్యకృష్ణ కెరీర్ లో ఐకానిక్ మూవీ.. 25 ఏళ్ళ తర్వాత తొలిసారి థియేటర్ లో చూస్తూ, వైరల్