Salaar Second Single : సలార్ రెండో పాట విడుదల.. లిరిక్స్ విన్నారా? ప్రశాంత్ నీల్ సూపర్ స్ట్రాటజీ

Published : Dec 21, 2023, 05:41 PM IST
Salaar Second Single : సలార్ రెండో పాట విడుదల.. లిరిక్స్ విన్నారా? ప్రశాంత్ నీల్ సూపర్ స్ట్రాటజీ

సారాంశం

రేపు ప్రపంచ వ్యాప్తంగా Salaar Cease Fire విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా యూనిట్ ప్రమోషన్స్ కొనసాగిస్తూనే ఉంది. తాజాగా సలార్ రెండో పాట Prathikadaloలో విడుదలైంది. లిరికల్ వీడియో చాలా ఆకట్టుకుంటోంది.   

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas)  సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel)  కాంబోలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ Salaar.  రేపు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఒక రోజులో మూవీ విడుదల ఉండగానూ యూనిట్ ప్రమోషన్స్ ను నిర్వహిస్తూనే ఉంది. ఇప్పటికే Salaar Trailer, Salaar సాంగ్స్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికి చిత్రం నుంచి ఒక్క సాంగ్ మాత్రమే వచ్చింది. ‘సూరీడే’ Sooreede అనే పాటను విడుదల చేశారు. అన్నీ భాషల్లో విడుదలైన మొదటి సాంగ్ కు మంచి రెస్పాన్స్ దక్కింది. 

ఇక తాజాగా రెండో పాటను విడుదల చేశారు. కొద్దిసేపటి కింద ఈ లిరికల్ వీడియో రిలీజ్ అయ్యింది. మొదటి పాటకు పూర్తి భిన్నంగా రెండో పాటను విడుదల చేశారు. సాంగ్ చాలా ఆసక్తికరంగా ఉంది. చిన్నపిల్లలు స్కూల్ లో పాడటంతో సాంగ్ ప్రారంభం అవుతుంది. ‘ప్రతి కథలో రాక్షసుడే రాక్షసుడే హింసలు పెడతాడు.. అణచగనే పుడుతాడు రాజు ఒకడు.. శత్రువునే కడదేర్చే పనిలో మనరాజు.. హింసలనే మరిగాడు మంచిని మరిచే’ అంటూ సాగిన పాట చాలా ఆసక్తికరంగా ఉంది. 

Prathi Kadhalo అనే టైటిల్ తో వచ్చిన ఈ రెండో పాట చాలా అద్భుతంగా ఉంది. కృష్ణకాంత్ అందించిన లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. మొత్తం మూడు చైల్డ్ సింగర్స్ గ్రూప్ తో పాడించిన తీరు బాగుంది. రవి బర్రూర్ క్యాచీ ట్యూన్ ను అందించారు. ప్రస్తుతం సాంగ్ మంచి రెస్పాన్స్ ను దక్కించుకుంటోంది. అయితే, మొది నుంచి సలార్ ప్రమోషన్స్ ఎంతో ఆసక్తికరంగా జరుగుతున్నాయి. ఎలాంటి అప్డేట్స్ ఇవ్వకపోయినా భారీ హైప్ ను క్రియేట్ చేశారు. సినిమా రిలీజ్ కు వారం రోజుల ముందు సెకండ్ ట్రైలర్ ను విడుదల చేశారు. 

మొదటి ట్రైలర్ కంటే.. రెండో ట్రైలర్ లోనే ప్రభాస్ ను అభిమానులకు కావాల్సినంతగా చూపించారు. యాక్షన్ ఫీస్ట్ కలిపించారు. మొదటి ట్రైలర్ తో ఖాన్ సార్ సామ్రాజ్యం గురించి పరిచయం చేస్తూ కథపై ఆసక్తిని పెంచారు. ఇక సాంగ్స్ లో ఓ స్ట్రాటజీ వాడారు. మొదటి పాటలో గొప్ప స్నేహాన్ని పరిచయం చేశారు. ఇక రెండో పాటలో ప్రభాస్ హింసకు దిగడానికి కారణాలను, ఆ తర్వాత అంశాలను చెప్పే ప్రయత్నం చేశారు. మొత్తంగా ట్రైలర్, పాటలతో యాక్షన్ తోపాటు, కథను కూడా ఆడియెన్స్ కు బాగా ఎక్కించేందుకు ప్రయత్నించారు. ప్రస్తుతం ఎలాంటి అప్డేట్ వచ్చినా నెట్టింట దుమ్ములేపుతోంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా