
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ను విమర్శించే వాళ్లు అంటూ ఎవరూ ఉండరు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే గుణం డార్లింగ్ సొంతం. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు హీరోగా కీర్తి పొందుతున్న రెబల్ స్టార్ ప్రస్తుతం ‘సలార్’ salaar తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. రేపు వరల్డ్ వైడ్ ఈ చిత్రం భారీ ఎత్తున విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. నిన్నేరాజమౌళితో నిర్వహించిన ఫుల్ ఇంటర్వ్యూ విడుదలైంది. సినిమాపై భారీ హైప్ ను పెంచేసింది.
ఇదిలా ఉంటే.. ‘సలార్’లో నటించిన బాలీవుడ్ నటుడు టిన్ను ఆనంద్ (Tinnu Anand) ప్రభాస్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇక ప్రభాస్ ఆథిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతి సినిమాకూ స్టార్ కాస్ట్ కు తన మర్యాదను చూపిస్తూనే ఉంటారు. తనకంటే సీనియర్, తనతో కలిసి పని చేసే నటీనటులను తన మర్యాద చూపి ఫిదా చేస్తుంటారు. ఇలాంటి ఘటనలు చాలానే ఉన్నాయి. ఇప్పటి వరకు డార్లింగ్ పై ఒక్క విమర్శ కూడా లేకుండా ఇండస్ట్రీలో ఎదుగుతున్న హీరోగా రికార్డు క్రియేట్ చేశారనే చెప్పాలి.
ఈ క్రమంలో బాలీవుడ్ నటుడు టిన్ను ఆనంద్ ప్రభాస్ ఆథిత్యంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ‘సలార్ టీజర్ తో నాకు ప్రశంసలు కురింపించేలా చేశాడు ప్రభాస్. అతని ఆథిత్యం చాలా గొప్పగా ఉంటుంది. ఓ సందర్భంలో నేనూ నా భార్య ఒక హోటల్ లో దిగాం. ఈ సందర్భంగా మమ్మల్ని గుర్తించిన ప్రభాస్ మాకోసం తన ఇంటినుంచి రుచికరమైన భోజనం పంపించారు.’ అని చెప్పుకొచ్చారు.
అలాగే ‘సలార్‘పై ఇప్పటికే బోలెడన్నీ అంచనాలు ఉన్నాయి. రేపు సినిమాను చూసేందుకు ప్రేక్షకులకు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా టిన్ను ఆనంద్ Salaar Cease Fire గురించి ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పుకొచ్చారు. ‘సలార్ కు ఎదురులేదు. ప్రేక్షకుల ఈ చిత్రం నుంచి మహాభారతంలోని కొన్ని అంశాలను అంతర్లీనంగా వీక్షిస్తారు. తద్వారా సలార్ ఓ గొప్ప కథను చెప్పబోతోంది. వెండితెరపై చూపించబోతోంది.’ అంటూ మరింత ఆసక్తిని పెంచేశారు.
సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ప్రభాస్, స్టార్ హీరోయిన్ శృతిహాసన్ జంటగా నటిస్తున్నారు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మాత విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు, టిన్ను ఆనంద్, శ్రియా రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. రవి బర్రూర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 22న (రేపు) ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.