Salaar Release Trailer : అప్డేట్ల విషయంలో ఎందుకీ తడబాటు.. అసలేం ఏం జరుగుంది? ఫ్యాన్స్ వర్రీ

Published : Dec 18, 2023, 12:16 PM IST
Salaar Release Trailer :  అప్డేట్ల విషయంలో ఎందుకీ తడబాటు.. అసలేం ఏం జరుగుంది? ఫ్యాన్స్ వర్రీ

సారాంశం

‘సలార్’ రెండ్ ట్రైలర్ మళ్లీ వాయిదా పడింది... డేట్, టైమ్ లో మార్పు చేస్తూ అప్డేట్ అందించారు. ఇలా అప్డేట్స్ విషయంలో అసలు ఎందుకు తడబడుతున్నారనేది సందేహంగా మారింది. ఫ్యాన్స్ కూడా ఇదే ఆలోచనలో ఉన్నారు. 

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas)  సినిమా రిలీజ్ అంటే ఫ్యాన్స్ పెద్ద పండుగ అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన సినిమాను ఎంతగానో సెలబ్రేట్ చేస్తుంటారు. హిట్ టాక్ వస్తే వాళ్ల ఎంతగా మురిసిపోతారో తెలియంది కాదు. గత రెండు మూడు చిత్రాలు భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా.. ఆశించిన మేర ఆకట్టుకోలేకపోయాయి. ఈ క్రమంలో ప్రభాస్ అభిమానులకు ‘సలార్’ రూపంలో కొండంత ఆశ లభించింది. మాస్, యాక్షన్ పరంగా Salaar Cease Fire తో డార్లింగ్ ఫుల్ మీల్స్ ఇస్తారని ఆశిస్తున్నారు. ఇప్పటివరకు వచ్చిన ప్రమోషనల్ మెటీరియల్ కూడా అంచనాలను మించి ఉన్నాయి. 

కానీ మేకర్స్ మాత్రం అప్డేట్లను అనౌన్స్ చేయడం, రిలీజ్ చేయడంలో కాస్తా తడబడుతున్నారు. మొదట సినిమాను సెప్టెంబర్ 28నే విడుదల చేస్తామని బలంగా ప్రచారం చేశారు. అప్పుడు అభిమానుల ఆనందానికి హద్దులు లేవనే చెప్పాలి. కానీ ఊహించని విధంగా డిసెంబర్ 22కు వాయిదా వేశారు. దీంతో కాస్తా హార్ట్ అయ్యారు డార్లింగ్ డైహార్డ్ ఫ్యాన్. అయినా వేచి ఉన్నారు. కనీసం సాలిడ్ ప్రమోషన్ ఉంటుందని భావించినా అంది కరువే అయ్యింది. ఇక తాజాగా Salaar Trailer 2 నిన్ననే రిలీజ్ చేస్తామన్నారు. అది కాస్తా ఈరోజు ఉదయం 10 :42 గంటలకు వాయిదా పడింది. కొద్దిసేపటి కింద మళ్లీ వాయిదా వేశారు.. మధ్యాహ్నం 2 గంటలకు రిలీజ్ ట్రైలర్ వస్తుందని ప్రకటన చేశారు. 

ఇలా ట్రైలర్ విడుదలకే ఇంతలా ఎందుకు తడబడుతున్నారంటూ... అసలేం జరుగుతుందంటూ ఫ్యాన్స్ వర్రీ అవుతున్నారు. సినిమాపై మాత్రం అభిమానులు ఆకాశమంత అంచనాలు పెట్టుకున్నారు. నాలుగు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ‘సలార్ సీజ్ ఫైర్’ విడుదల కానుంది. అన్నీ చోట్లా బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. ఇక ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్. పృథ్వీ రాజ్ సుకుమారన్, జగపతిబాబు, శ్రియా రెడ్డికీలక పాత్రల్లో నటిస్తున్నారు. రవి బర్సూర్ సంగీతం అందిస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

500 కోట్ల ధురంధర్, స్టార్ హీరోలను కూడా భయపెడుతున్న రణ్ వీర్ సింగ్ సినిమా
రవితేజ సంచలన నిర్ణయం, మాస్ మహారాజా ట్యాగ్ ను దూరం పెట్టిన స్టార్ హీరో?