
మహేష్ బాబు సతీమణి నమ్రత తరచుగా తన ఫ్యామిలీ విశేషాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం చూస్తూనే ఉన్నాయి. మహేష్ కుమార్తె సితార అయితే చూస్తుండగానే క్రేజీ సెలెబ్రిటీగా మారిపోయింది. యాడ్ షూట్ లు కూడా చేస్తోంది. ఇక మహేష్ తనయుడు గౌతమ్ ఘట్టమనేని కూడా తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు.
తమ పిల్లల గురించి, మహేష్ బాబు గురించి ఎలాంటి మంచి విషయం ఉన్నా నమ్రత వెంటనే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో షేర్ చేస్తుంది. సితార డ్యాన్స్ వీడియోలని నమ్రత షేర్ చేస్తూ మురిసిపోతూ ఉంటుంది. అలాగే గౌతమ్ గురించి ఎలాంటి విషయం ఉన్నా ఫ్యాన్స్ తో పంచుకుంటుంది నమ్రత.
తాజాగా నమ్రత.. తన ముద్దుల కుమారుడు గౌతమ్ గురించి ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ఇకపై గౌతమ్ ఘట్టమనేని ఫ్యామిలీకి దూరంగా ఉండబోతున్నాడు. గౌతమ్ ఉన్నత చదువుల కోసం న్యూయార్క్ వెళుతున్నాడు. న్యూయార్క్ యూనివర్సిటీలో గౌతమ్ కొత్త అధ్యాయం ప్రారంభించబోతున్నట్లు నమ్రత పోస్ట్ చేసింది. నీ హార్డ్ వర్క్, ఫ్యాషన్, సంకల్పం చూస్తుంటే నాకు గర్వంగా ఉంది. నువ్వు మరింత ఎత్తుకు ఎదగాలి అని నమ్రత సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు.
అయితే గౌతమ్ ఏం చదవబోతున్నాడు అనేది రివీల్ చేయలేదు. ఫ్యాన్స్ అంతా గౌతమ్ కి ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు. ఉన్నత చదువులు పూర్తయ్యే వరకు ఇక గౌతమ్ కుటుంబానికి దూరంగా విదేశాల్లోనే ఉండే అవకాశం ఉంది.