సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) తాజాగా షాకింగ్ కామెంట్స్ చేశారు. కేజీఎఫ్, సలార్ కు కనెక్షన్ ఉంటుందని భావించిన ఆడియెన్స్ కు మతిపోయే సీక్రెట్ రివీల్ చేశారు. సినిమాటిక్ యూనివర్స్ పై ఆయన చెప్పిన మాటలు ఇలా ఉన్నాయి...
‘కేజీఎఫ్’ రెండు భాగాలతో దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేశారో తెలిసిందే. కేజీఎఫ్ ఛాప్టర్ 1 మరియు కేజీఎఫ్ చాఫ్టర్ 2తో ఇండియాలోనే టాప్ డైరెక్టర్ గా నిలిచారు. ఆ వెంటనే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) తో ‘సలార్’ ను ప్రకటించారు. Salaar Cease Fire మొదటి భాగం మరో ఆరు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా యూనిట్ ప్రమోషన్స్ ను ప్రారంభించింది. ఇప్పటికే టీజర్, ట్రైలర్, హార్ట్ టచ్చింగ్ సాంగ్ విడుదల చేసి సినిమాపై మరింతగా హైప్ పెంచారు.
ఇక సలార్ తో ప్రశాంత్ నీల్ మరో కొత్త ప్రపంచాన్ని పరిచయం చేయబోతుండటం ఆసక్తికరంగా మారింది. ట్రైలర్ విడుదలకు ముందు ‘కేజీఎఫ్’, ‘సలార్’కు కనెక్షన్ ఉందంటూ తెగ వార్తలు వచ్చాయి. సలార్ లోనూ యష్ ఎంట్రీ ఉంటుందంటూ ప్రచారం. కానీ తాజాగా ప్రమోషన్స్ లో ప్రశాంత్ నీల్ చేసిన కామెంట్స్ షాకింగ్ గా ఉన్నాయి. ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli)కి తను ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది.
ఇంతకీ ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే.. కేజీఎఫ్ (KFG), సలార్ కు ఎలాంటి కనెక్షన్ లేదని చెప్పుకొచ్చారు. వాళ్లిద్దరూ వేర్వేరు ప్రపంచంలో ఉన్నారన్నారు. సినిమాటిక్ యూనివర్స్ ను క్రియేట్ చేసేంత సామర్థ్యం కూడా నాకు లేదు అంటూ చెప్పినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ వ్యాఖ్యలు షాకింగ్ గా ఉన్నాయి. మరోవైపు కేజీఎఫ్, సలార్ కు ఎలాంటి సంబంధం లేదని కూడా తెలిసిపోతోంది. త్వరలోనే రాజమౌళితో నిర్వహించిన ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియో రానుంది.
సలార్ సీజ్ ఫైర్ డిసెంబర్ 22న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ప్రస్తుతం ప్రమోషన్స్ ను మొదలు పెట్టారు. ఈరోజు ఎస్ఎస్ రాజమౌళి తెలుగు స్టేట్స్ లోని బిగ్ టికెక్ ను కొనుగోలు చేశారు. అంతటా బుకింగ్స్ కు సూపర్ రెస్పాన్స్ దక్కుతోంది. ‘సలార్’తో ప్రభాస్ అభిమానులకు యాక్షన్ ఫీట్ అందిస్తారని ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు స్టేట్స్ లో మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేస్తోంది. శృతి హాసన్ హీరోయిన్. మలయాళం స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు, శ్రియా రెడ్డి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హోంబలే ఫిల్మ్స్ రూ.300 కోట్లతో నిర్మించింది. రవి బర్సూర్ సంగీతం అందిస్తున్నారు.