ఈ స్టార్స్ అందరికీ లైసెన్సెడ్ గన్స్ ఉన్నాయి, లైసెన్స్ ప్రాసెస్ ఏమిటి?

By Surya Prakash  |  First Published Oct 2, 2024, 11:02 AM IST

 జిల్లా మేజిస్ట్రేట్ ఆమోదం తర్వాత లైసెన్స్(Gun License) జారీ చేస్తారు. దీని తర్వాత మీరు దరఖాస్తు చేసుకున్న అదే ఆయుధాన్ని కొనుక్కోవచ్చు. అయితే మీరు ప్రభుత్వ ఆమోదించిన షాప్ ల నుంచి  మాత్రమే తుపాకీలను



బాలీవుడ్ ప్ర‌ముఖ న‌టుడు గోవిందా బుల్లెట్ గాయాల‌తో ఆసుప‌త్రిలో చేర‌డం క‌ల‌కలం సృష్టించింన సంగతి తెలిసిందే. గోవిందా ఇంట్లో గ‌న్ మిస్‌ఫైర్ కావ‌డంతో ఆయ‌న‌ కాలికి గాయ‌మైంది.  దీంతో ఆయ‌న్ను వెంట‌నే ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం గోవిందా ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంద‌ని వైద్యులు తెలిపారు. గోవిందా కోల్‌కతాకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న స‌మ‌యంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకున్న‌ట్లు ఆయ‌న మేనేజర్ శశి సిన్హా చెప్పారు. ఆయ‌న‌ తన లైసెన్స్‌డ్ రివాల్వర్‌ కింద పడిపోవ‌డంతో దాన్ని అల్మారాలో ఉంచే క్ర‌మంలో అది పేలి బుల్లెట్ గోవిందా కాలికి తగిలిందని వివ‌రించారు. దేవుడి దయ వల్లనే గోవిందా కాలికి గాయమైందని, పెద్దగా ఏమీ కాలేదని చెప్పారు. ఈ నేపధ్యంలో అసలు బాలీవుడ్ సెలబ్రెటీల్లో ఎవరికి గన్ లైసెన్స్ ఉంది అనేది చర్చనీయాంశంగా మారింది.

 తుపాకీ లైసెన్స్ ఎవరికి ఇస్తారు,ప్రాసెస్ ఏంటి

మన దేశంలో ఆత్మరక్షణ కోసం తుపాకీ దగ్గర ఉంచుకోవటానికి ఫర్మిషన్ ఉంది. అయితే, దానికి ప్రభుత్వం నుంచి లైసెన్స్(Gun License) తీసుకోవాలి.అయితే  లైసెన్స్అంత ఈజీగా ఇవ్వరు.. తుపాకీ లైసెన్స్ కోసం చాలా పెద్ద ప్రాసెస్ ఉంది.  దీని కోసం, ముందుగా మీరు ఆయుధాల లైసెన్స్(Gun License) దరఖాస్తు ఫారమ్‌ను పూరించాలి. మీరు ఈ ఫారమ్‌ను మీ రాష్ట్ర పోలీసు శాఖ వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు . అప్లికేషన్‌లో, మీరు మీ వ్యక్తిగత వివరాలు, విద్య, ఆదాయ వనరు - మీరు కొనుగోలు చేయాలనుకుంటున్న ఆయుధం గురించి సమాచారాన్ని పూరించాలి. ఫీజు చెల్లించిన తర్వాత దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించాల్సి ఉంటుంది.

Latest Videos

ఇక   దరఖాస్తు ఫారం - పత్రాలను అప్‌లోడ్ చేసిన తర్వాత, పోలీసులు మీ ధృవీకరణను చేస్తారు. పోలీసులు మీ నేర చరిత్ర, మీ సామాజిక సంబంధాలు - మీరు దరఖాస్తు చేస్తున్న ఆయుధాన్ని మీరు ఉపయోగించాల్సిన అవసరం ఉందా?  అంటే మీకు ఈ ఆయుధం ఎందుకు కావాలి? వంటివి పరిశీలిస్తారు. ఆ తర్వాత జిల్లా మేజిస్ట్రేట్ ఆమోదం తర్వాత లైసెన్స్(Gun License) జారీ చేస్తారు. దీని తర్వాత మీరు దరఖాస్తు చేసుకున్న అదే ఆయుధాన్ని కొనుక్కోవచ్చు. అయితే మీరు ప్రభుత్వ ఆమోదించిన షాప్ ల నుంచి  మాత్రమే తుపాకీలను కొనుగోలు చేయాలి. లైసెన్స్‌పై ఏ ఆయుధాన్ని తీసుకున్నారనే పూర్తి వివరాలను కూడా పోలీసు స్టేషన్‌లో పోలీసుల వద్ద ఉంచాల్సి ఉంటుంది. 

ఏ స్టార్స్ దగ్గర గన్స్ ఉన్నాయి

బాలీవుడ్ లో ఈ స్టార్స్ అందరూ గన్ లైసెన్స్ తీసుకుని తమ దగ్గర తుపాకీ లు కొనుక్కున్నారు. 

గోవింద
సల్మాన్ ఖాన్
సంజయ్ దత్
అమితాబ్ బచ్చన్
పూనమ్ థిల్లాన్
సన్ని డియోల్
రవి కిషన్
సోహా అలీ ఖాన్ 

మన తెలుగు రాష్ట్రాల్లో గన్ లు ఎంతమంది దగ్గర ఉన్నాయి

 
 దేశ వ్యాప్తంగా గన్ లు ఉన్న వారి  లెక్కలు చూస్తే.. 33.69 లక్షల మంది లైసెన్స్‌ కలిగి ఉన్నారు. వీటిలో టాప్ ప్లేస్‌లో ఉత్తరప్రదేశ్ - 13,29,584, మధ్యప్రదేశ్ - 2,82,675, కర్ణాటక - 1,20,719, పంజాబ్ - 81,516, నాగాలాండ్ - 44,473 లైసెన్స్‌డ్ గన్స్‌తో టాప్ 5 లిస్ట్‌లో ఉన్నాయి. ఉత్తరాదితో పోలిస్తే.. దక్షిణాదిలో కర్నాటక మినహా మిగతా రాష్ట్రాల్లో లైసెన్స్‌డ్ గన్స్ కలిగిన వారి సంఖ్య చాలా తక్కువగా. దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక - 1,20,719 లైసెన్స్‌లతో అగ్రస్థానం ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో తమిళనాడు - 24,237, కేరళ - 11,330, తెలంగాణ - 9,810, ఆంధ్రప్రదేశ్‌ - 7,007 ఉన్నాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. లైసెన్స్ గన్ కలిగి ఉన్న వారిలో ఎక్కువగా.. భద్రతా సిబ్బంది, క్రీడాకారులు ఉన్నారు. 

click me!