Prabhas: సలార్ యాక్షన్ సన్నివేశాలు.. కనీవినీ ఎరుగని స్థాయిలో! 

Published : May 29, 2022, 06:15 PM IST
Prabhas: సలార్ యాక్షన్ సన్నివేశాలు.. కనీవినీ ఎరుగని స్థాయిలో! 

సారాంశం

ప్రభాస్ అప్ కమింగ్ చిత్రాల్లో సలార్ పై భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలు అందుకునేలా అదే స్థాయిలో ఈ చిత్ర చిత్రీకరణ జరుగుతుంది. సలార్ మూవీ ఒక్కొక్క అప్డేట్ గూస్ బంప్స్ కలిగించేవిగా ఉన్నాయి.   


బాహుబలి తర్వాత ప్రభాస్ (Prabhas) రెండు చిత్రాలు తెలుగు ప్రేక్షకులను నిరాశ పరిచాయి. రాధే శ్యామ్ అయితే పూర్తి నిరాశపరిచింది. ఓ సాలిడ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. దీనికి సలార్ కరెక్ట్ అంటున్నారు. ప్రభాస్ కి తన స్థాయి హిట్ ఇవ్వగల చిత్రం సలార్ గా ఫాన్స్ భావిస్తున్నారు. సినిమాపై ఫ్యాన్స్ అంచనాలు ఈ స్థాయిలో ఉండగా దర్శకుడు ప్రశాంత్ నీల్ అదే స్థాయిలో చిత్రాన్ని సిద్ధం చేస్తున్నారు. సలార్ మూవీ (Salaar) యాక్షన్ సన్నివేశాలు నభూతో నభవిష్యతి అన్నట్లు ప్లాన్ చేస్తున్నాడట. 

ప్రభాస్ కట్ అవుట్ కి సరిపోయేలా భారీ ఎత్తున యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారట. లేటెస్ట్ షెడ్యూల్ లో హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నారట. దీని కోసం ఆర్ట్ డైరెక్టర్ తో సమీక్ష జరిపి సెట్స్ రూపొందించారు. సినిమా మొత్తంలో ఫైట్స్ ఎక్కువగానే ఉంటాయని తెలుస్తోంది. సలార్ లో ప్రభాస్ చేసే పోరాటాలు ఫ్యాన్స్ ని సీట్లలో కుర్చోనివ్వవట. గూస్ బంప్స్ కలిగించే ఈ సన్నివేశాలు సలార్ చిత్రంలో హైలెట్ అంటున్నారు. ఇక హీరోయిజం ఎలివేషన్ ఎలా ఉండాలో కెజిఎఫ్ తో ప్రశాంత్ నీల్ చాలా మందికి రోల్ మోడల్ అయ్యాడు. 

కెజిఎఫ్, కెజిఎఫ్ 2 (KGF 2) చిత్రాలలో ఆయన తెరకెక్కించిన యాక్షన్ సన్నివేశాలు దుమ్మురేపాయి. ఇక 35 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న సలార్ 2023 సమ్మర్ కానుకగా విడుదల కానుంది. హోమబుల్ ఫిలిమ్స్ నిర్మిస్తుండగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. జగపతి బాబు ఓ కీలక రోల్ చేస్తున్నారు. బొగ్గు గనుల నేపథ్యంలో సలార్ తెరకెక్కుతున్నట్లు సమాచారం. 

ఇక ప్రభాస్ జనవరిలో ఆదిపురుష్ చిత్రంతో పలకరించనున్నాడు. ఈ రామాయణగాథ సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. అలాగే ప్రభాస్ ప్రాజెక్ట్ కే చిత్రీకరణలో కూడా పాల్గొంటున్నారు. ఈ చిత్రానికి నాగ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా మారుతి దర్శకత్వంలో చేయాల్సిన చిత్రం త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. సందీప్ రెడ్డి వంగాతో ప్రకటించిన స్పిరిట్ వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లే అవకాశం కలదు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: తనూజ విన్నర్ కాదు... ఎలిమినేషన్ తర్వాత భరణి షాకింగ్ కామెంట్స్
Dhurandhar: ధురంధర్ ధాటికి ఈ సినిమాల రికార్డులు గల్లంతు.. నెక్స్ట్ టార్గెట్ రష్మిక మూవీనే