NBK 107: దశాబ్దాలుగా బాలయ్యను వెంటాడుతున్న బ్యాడ్ సెంటిమెంట్... మలినేని అధిగమిస్తాడా!

Published : May 29, 2022, 04:59 PM IST
NBK 107: దశాబ్దాలుగా బాలయ్యను వెంటాడుతున్న బ్యాడ్ సెంటిమెంట్... మలినేని అధిగమిస్తాడా!

సారాంశం

దర్శకుడు గోపీచంద్ మలినేని ని బాలయ్య బ్యాడ్ సెంటిమెంట్ వెంటాడుతుంది. ఆ ప్రమాదం నుండి ఎలాగైనా గట్టెక్కాలని తీవ్రంగా కృషి చేస్తున్నాడు. బాలయ్య సినిమాపై ఆయన చూపిస్తున్న శ్రద్దే దీనికి నిదర్శనం.   

ఒక బ్లాక్ బస్టర్ ఇస్తే అరడజను ప్లాప్స్ ఇవ్వడం బాలయ్యకున్న అలవాటు. గత రెండు దశాబ్దాల్లో బాలయ్య (Balakrishna) బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టిన సందర్భం లేదు. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, సింహ, లెజెండ్ ఇలా ప్రతి బిగ్గెస్ట్ హిట్ తర్వాత బాలయ్యకు ప్లాప్స్ ఎదురయ్యాయి. ఇక ఆయన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ అఖండ. ఇప్పుడు కూడా బాలయ్యను ఆ బ్యాడ్ సెంటిమెంట్ వెంటాడుతుందేమోనన్న భయం అభిమానుల్లో మొదలైంది. ఈ సందేహం దర్శకుడు గోపీచంద్ మలినేని ని కూడా వెంటాడే అవకాశం లేకపోలేదు. 

దాదాపు రూ. 120 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ రాబట్టిన అఖండ (Akhanda) ఈ మధ్య కాలంలో భారీ లాభాలు పంచిన చిత్రంగా రికార్డులకెక్కింది. ఈ తరం స్టార్స్ హిట్ చిత్రాల వసూళ్లతో పోల్చుకుంటే తక్కువే అయినప్పటికీ... మూవీ బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కల ప్రకారం అఖండ నిర్మాతకు, డిస్ట్రిబ్యూటర్స్ కి లాభాలు పంచింది. బాలయ్య కెరీర్ లోనే అతిపెద్ద విజయాల్లో ఒకటిగా అఖండ నిలిచింది. దీంతో బాలయ్య నెక్స్ట్ మూవీపై ఫ్యాన్స్ అంచనాలు కూడా పెరిగిపోయాయి. 

హిట్ తర్వాత ఖచ్చితంగా ప్లాప్ అనే బాలయ్య సెంటిమెంట్ రిపీట్ అయితే మాత్రం గోపీచంద్(Gopi Chand Malineni) కి షాక్ తగిలినట్లే. పాపం చాలా గ్యాప్ తీసుకొని క్రాక్ తీశాడు గోపీచంద్. అనూహ్యంగా సూపర్ హిట్ కొట్టిన క్రాక్ ఆయనకు సూపర్ కమ్ బ్యాక్ ఇచ్చింది. ఇప్పుడు బాలయ్య మూవీ విజయం సాధిస్తే గోపీచంద్ కి తిరుగుండదు. మరిన్ని క్రేజీ ఆఫర్స్, కోట్ల రెమ్యూనరేషన్ వచ్చిపడుతుంది. లేదా మరలా కెరీర్ ప్రమాదంలో పడుతుంది. 

కనుక ఈ సెంటిమెంట్ ని అధిగమించి గోపీచంద్ బాలయ్యకు హిట్ ఇవ్వాల్సిన అవసరం చాలా ఉంది. ఇక నిన్న ఎన్టీఆర్ జయంతి సందర్భంగా NBK 107 విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంది. ఎప్పటిలాగే బాలయ్యను ఊరమాస్ లుక్ లో గోపీచంద్ ప్రజెంట్ చేశాడు. అయితే ఈ లుక్ పై నెగిటివ్ కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. లుక్ అఖండ చిత్రానికి దగ్గరగా ఉన్న నేపథ్యంలో రొటీన్ గా ఉందంటున్నారు. 

ఈ చిత్రానికి జై బాలయ్య అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. తనకు రెండు హిట్స్ ఇచ్చిన లక్కీ హీరోయిన్ శృతి హాసన్ ని మరోమారు గోపీచంద్ ఎంపిక చేశారు. కెరీర్ లో మొదటిసారి ఆమె బాలయ్యతో జతకడుతుంది. 
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: తనూజ విన్నర్ కాదు... ఎలిమినేషన్ తర్వాత భరణి షాకింగ్ కామెంట్స్
Dhurandhar: ధురంధర్ ధాటికి ఈ సినిమాల రికార్డులు గల్లంతు.. నెక్స్ట్ టార్గెట్ రష్మిక మూవీనే