ఓ వైపు నెపోటిజం సెగలు.. కుమారుడి పరిచయం చేయబోతున్న సైఫ్‌

Published : Nov 06, 2020, 08:48 AM ISTUpdated : Nov 06, 2020, 08:55 AM IST
ఓ వైపు నెపోటిజం సెగలు..  కుమారుడి పరిచయం చేయబోతున్న సైఫ్‌

సారాంశం

వారసత్వం, బంధుప్రీతి బాలీవుడ్‌లో ఇతరులను రానివ్వడం లేదని, ఎదగనివ్వడం లేదనే విమర్శలు బాగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌లో మరో స్టార్‌ వారసుడు ఎంట్రీ ఇవ్వబోతున్నారు.   

ఓ వైపు బాలీవుడ్‌ నెపోటిజం వివాదం కొనసాగుతూనే ఉంది. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య తర్వాత ఈ వాదన మరింత ఊపందుకుంది. వారసత్వం, బంధుప్రీతి బాలీవుడ్‌లో ఇతరులను రానివ్వడం లేదని, ఎదగనివ్వడం లేదనే విమర్శలు బాగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌లో మరో స్టార్‌ వారసుడు ఎంట్రీ ఇవ్వబోతున్నారు. 

బాలీవుడ్‌ అగ్ర నటుడు సైఫ్‌ అలీ ఖాన్‌ తన తనయుడు ఇబ్రహీం అలీ ఖాన్‌ని హీరోగా పరిచయం చేయబోతున్నారు. ఇప్పటికే సైఫ్‌ తనయు సారా అలీ ఖాన్‌ హీరోయిన్‌గా పరిచయం అయి రాణిస్తున్న విషయం తెలిసిందే. త్వరలో తన కుమారుడిని ఇంట్రడ్యూస్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నట్టు సైఫ్‌ ప్రకటించారు. 

`ఇబ్రహీం చదువు పూర్తయ్యాక సినిమాల్లోకి అడుగుపెడతాడు. సినిమాల్లో నటించాలనుకుంటే ఇప్పటి నుంచి సిద్ధమవ్వాలని చెప్పాను. నా పిల్లలందరినీ సినీ పరిశ్రమలోకి తీసుకొస్తాను. అందుకు సంతోషంగా ఉన్నాను. పనిచేసేందుకు సినీ రంగం మంచి ప్లేస్‌. 18 ఏళ్ళ వయసులో నా జీవితం అంతా గందరగోళంగా ఉండేది. నటన నా కెరీర్‌ పాడవకుండా ఆపింది. మంచి గుర్తింపునిచ్చింది. అందుకే నా పిల్లలను సినీరంగంలోకి తీసుకురావాలనుకుంటున్నాను` అని సైఫ్‌ తెలిపారు.

ఇబ్రహీం, సారా అలీ ఖాన్‌లు సైఫ్‌ మొదటి భార్య అమృతా సింగ్‌లకు జన్మించారు. సైఫ్‌ ఆమెకి 2004లో విడాకులిచ్చారు. ఆ తర్వాత 2012లో కరీనా కపూర్‌ని వివాహం చేసుకున్నారు. వీరికి తైమూర్‌ అలీ ఖాన్‌ కుమారుడు జన్మించారు. ప్రస్తుతం కరీనా ప్రెగ్నెంట్‌గా ఉన్న విషయం తెలిసిందే. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

బాహుబలి కంటే ముందు రమ్యకృష్ణ కెరీర్ లో ఐకానిక్ మూవీ.. 25 ఏళ్ళ తర్వాత తొలిసారి థియేటర్ లో చూస్తూ, వైరల్
అన్ని అనుభవించాలన్నదే నా కోరిక.. స్టార్ హీరోయిన్ ఓపెన్ కామెంట్స్