సాయిధరమ్ తేజ్, రాశి ఖన్నా ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీ అదిరిందిగా!

Published : Sep 23, 2019, 08:18 PM IST
సాయిధరమ్ తేజ్, రాశి ఖన్నా ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీ అదిరిందిగా!

సారాంశం

సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ ఈ ఏడాది ఎట్టకేలకు వరుస పరాజయాల నుంచి బయటపడ్డాడు. తేజు నటించిన చిత్రలహరి చిత్రం మంచి విజయం సాధించింది. వరుసగా 6 ఫ్లాపులు ఎదుర్కొన్న తర్వాత తేజుకి ఈ విజయం దక్కింది. దీనితో సాయిధరమ్ తేజ్ తన తదుపరి చిత్రాల విషయంలో ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు. 

సాయిధరమ్ తేజ్, రాశి ఖన్నా జంటగా రెండవసారి నటిస్తున్న చిత్రం ప్రతిరోజు పండగే. వినోదాత్మక చిత్రాల దర్శకుడు మారుతి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. గీతా ఆర్ట్స్ సంస్థ బ్యానర్ పై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. 

ఇటీవల విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. వినోదాత్మక అంశాలతో మారుతి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సత్యరాజ్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ రాజమండ్రిలో జరుగుతోంది. 

హీరో, హీరోయిన్లపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. షూటింగ్ గ్యాప్ లో సాయిధరమ్ తేజ్ తో ఉన్న ఫోటోలని రాశి ఖన్నా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరినట్లు ఉంది. ఈ ఫొటోల్లో ఒకరినొకరు కౌగిలించుకుని కనిపిస్తున్నారు. ఆఫ్ స్క్రీన్ లోనే కెమిస్ట్రీ అదిరిపోతుంటే.. ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఎలా ఉండబోతోందో మరి!

 

PREV
click me!

Recommended Stories

Kayadu Lohar: నేపాలీ నేపథ్యం, అస్సాం నుంచి మొదలైన ప్రయాణం.. కయదు లోహర్ గురించి ఈ విషయాలు తెలుసా ?
Anasuya: భర్త మరణిస్తే బొట్టు, గాజులు తీసేయాల్సిన అవసరం ఏంటి ? తీవ్ర దుమారం రేపుతున్న అనసూయ కామెంట్స్