సైరా వివాదం: చిరంజీవి గారు మీ కొడుకు ఏం చేశాడో తెలుసా.. సంచలన వ్యాఖ్యలు!

By tirumala ANFirst Published Sep 23, 2019, 7:48 PM IST
Highlights

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం సైరా నరసింహారెడ్డి. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా విడుదల కానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఈ చిత్రం 250 కోట్ల బడ్జెట్ లో నిర్మించారు. సురేందర్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. 

సైరా చిత్రం విషయంలో ఉయ్యాలవాడ కుటుంబీకులు చేస్తున్న ఆరోపణలు తీవ్ర వివాదంగా మారుతున్నాయి. ఈ చిత్ర నిర్మాత రాంచరణ్ తమకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చి ఇప్పుడు మాట తప్పారని, కనీసం తమని కలవడానికి కూడా ఇష్టపడడం లేదని విమర్శలు చేస్తున్నారు. ఇటీవల ఉయ్యాలవాడ వంశస్థులు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో చిరు, రాంచరణ్ పై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. 

ఉయ్యాలవాడ వంశస్థులుగా ఆయనపై తెరకెక్కిస్తున్న సినిమాపై మాకు కూడా హక్కులు ఉంటాయి. తమకు 50 కోట్లు ఇవ్వాలంటూ జూబ్లీ హిల్స్ లో పోలీస్ కేసు నమోదు చేశారు. తాజాగా ఉయ్యాలవాడ కుటుంబీకులు ప్రముఖ దర్శక నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి సాయంతో హై కోర్టులో ఫిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా కేతిరెడ్డి మాట్లాడుతూ చిరంజీవి, రాంచరణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. 

ఉయ్యాలవాడ కుటుంబికులని ఇబ్బంది పెడుతూ, వాళ్ళు డబ్బు కోసం ఇదంతా చేస్తున్నారనే అసత్య ప్రచారాన్ని చేస్తున్నారని కేతిరెడ్డి అన్నారు. వాళ్ళు డబ్బు కోసం రాంచరణ్ ఆఫీస్ కు వెళ్ళలేదు. తమ కుటుంబానికి చెందిన వీరుడి సినిమా తీస్తున్న సందర్భంగా సంతోషాన్ని తెలిపేందుకు వెళ్లారు. 

కానీ రాంచరణ్ వీరిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. చిరంజీవి గారు మీ కొడుకు చేసే పనులు మీకు తెలియడం లేదా.. వీళ్లకు సాయం చేస్తానని మాట ఇచ్చి సంతకాలు కూడా తీసుకున్నారు. అదేవిధంగా కేతిరెడ్డి పవన్ కళ్యాణ్ పై కూడా పరోక్షంగా వ్యాఖ్యలు చేసారు. మేము రాజకీయ నాయకులం.. ప్రజా క్షేత్రంలోనే ఉంటాం అని చెప్పుకునే ఓ వ్యక్తికి ఉయ్యాలవాడ కుటుంబీకుల ఇబ్బందులు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. 

చిరంజీవి గారు కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. పాపం ఉయ్యాలవాడ కుటుంబీకుల జీవన విధానం చూస్తుంటే జాలి కలగడం లేదా.. మీ కొడుకు చూస్తే ఒక్క రూపాయి కూడా వాళ్లకు ఇవ్వను.. ఉయ్యాలవాడ ప్రాంతానికి ఇస్తాను అని చెప్పాడు.. నరసింహారెడ్డి కుటుంబ సభ్యులకు ఏమీ చేయలేని వాడు ఆ ఊరికి ఏం చేస్తాడు అని కేతిరెడ్డి ప్రశ్నించారు. 

దీనిపై తాను పోరాటం చేస్తానని కేతిరెడ్డి అన్నారు. ఇక ఉయ్యాలవాడ కుటుంబీకులు.. తాము సినిమా చూసి ఓకే అన్న తర్వాతే విడుదల చేయాలి.. సినిమాని వాళ్ళు ఎలా తీశారో నరసింహారెడ్డి కుటుంబ సభ్యులుగా తెలుసుకునే హక్కు మాకు ఉంది అని డిమాండ్ చేస్తున్నారు. 

"

"

"

click me!