సక్సెస్ కలల్లో మహర్షి టీమ్.. కళ్ళు తెరిస్తే మంచిది?

Published : May 02, 2019, 03:05 PM IST
సక్సెస్ కలల్లో మహర్షి టీమ్.. కళ్ళు తెరిస్తే మంచిది?

సారాంశం

మహేష్ బాబు ప్రతిష్టాత్మక 25వ చిత్రం మహర్షి మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో గాని చిత్ర యూనిట్ మాత్రం సినిమా విడుదలకు ముందే సక్సెస్ కలల్లో తేలిపోతోంది. . 

ట్రైలర్ కి ముందు వరకు సినిమా మీద కొంత నెగిటివ్ బాజ్ ఉండేది. ట్రైలర్ బావుండడంతో సినిమాకు కాస్త పాజిటివ్ టాక్ వస్తోంది. పాటలు పెద్దగా క్లిక్కవ్వలేదు. మహేష్ లుక్స్ పై కొన్ని ట్రోల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ప్రీ రిలీజ్ వేడుకలో చిత్ర యూనిట్ సినిమా స్థాయిని పెంచే ప్రయత్నం చేశాయి.

 తప్పకుండా సినిమా హట్టవుతుందని సక్సెస్ మీట్ డేట్ ని కూడా ఫిక్స్ చేసుకున్నారు. మే 9న సినిమా రిలీజ్ కాబోతోంది. ఇక మే18 సినిమా సక్సెస్ మీట్ ను విజయవాడలో నిర్మించనున్నట్లు నిర్మాతల్లో ఒకరైన PVP తెలిపారు. అంతా బాగానే ఉంది గాని చిత్ర యూనిట్ సినిమా రిజల్ట్ పై మరి ఎక్కువ ఊహించేసుకుంటున్నట్లు అర్ధమవుతోంది. 

రిజల్ట్ సంగతి పక్కనపెడితే ముందే సక్సెస్ మీట్ డేట్ ను ఫిక్స్ చేయడం అనేది ఓవర్ గా ఉందని కామెంట్స్ వస్తున్నాయి. ఎందుకంటే సినిమాపై ఒక దశవరకు అంచనాలు వెళ్లగలిగితే మంచి ఓపెనింగ్స్ అందుతాయి. కానీ అదే పనిగా బాక్స్ ఆఫీస్ హిట్టని డబ్బా కొద్ట్టుకుంటే రిజల్ట్ లో తేడా కొట్టేస్తుంది. ట్రైలర్ అయితే సినిమాపై ఉన్న నెగిటివ్ టాక్ ను కొంత వరకు తీసేసిందని చెప్పాలి. మరి చిత్ర యూనిట్ చెప్పినట్టుగా సినిమా ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి

PREV
click me!

Recommended Stories

Trisha Krishnan: పెళ్లిపై త్రిష అదిరిపోయే రియాక్షన్‌.. ఎప్పుడు, ఎవరిని చేసుకుంటుందో చెప్పిన స్టార్‌ హీరోయిన్‌
Virosh Sangeeth Party: తెల్లవారుజామున 4 గంటల వరకు సంగీత్‌ పార్టీ.. నవాబ్‌లను తలపించే లుక్‌.. విజయ్‌, రష్మిక ఎమోషనల్‌