భార్య ఆత్మహత్య కేసులో నటుడు రాజన్‌ పి దేవ్‌ కుమారుడు అరెస్ట్

Published : May 26, 2021, 09:17 AM ISTUpdated : May 26, 2021, 09:21 AM IST
భార్య ఆత్మహత్య కేసులో నటుడు రాజన్‌ పి దేవ్‌ కుమారుడు అరెస్ట్

సారాంశం

ప్రముఖ నటుడు రాజన్‌ పి దేవ్‌ కుమారుడు  నటుడు ఉన్ని రాజన్‌ అరెస్ట్ అయ్యారు. భార్యని హింసించి, ఆత్మహత్యకి ఉసిగొల్పిన కేసులో ఆయన్ని కేరళలోని నెడుమంగడ్‌ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. 

ప్రముఖ నటుడు రాజన్‌ పి దేవ్‌ కుమారుడు  నటుడు ఉన్ని రాజన్‌ అరెస్ట్ అయ్యారు. భార్యని హింసించి, ఆత్మహత్యకి ఉసిగొల్పిన కేసులో ఆయన్ని కేరళలోని నెడుమంగడ్‌ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ని చాలా రోజుల క్రితమే అరెస్ట్ చేయాల్సి ఉండగా, ఆయనకు కరోనా సోకడంతో అది తగ్గేంత వరకు వెయిట్‌ చేసి మంగళవారం అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఉన్నిరాజన్​ కమెడియన్​గా, విలన్​గా దాదాపు ముప్ఫై  మలయాళ చిత్రాల్లో నటించాడు. 

2019లో ఉన్నికి ప్రియాంకతో వివాహం జరిగింది. ఆమె ఓ స్కూల్​లో టీచర్​గా పని చేస్తోంది. పెళ్లయిన కొన్నాళ్లకే అదనపు కట్నంతో పాటు డిమాండ్‌ చేయడంతోపాటు ఇతర హింసలకు పాల్పడుతూ వచ్చారని,  ప్రతీరోజూ హింసించేవాడని ప్రియాంక తల్లి ఆరోపించింది. ఓ రోజు గొడవలో అడ్డువెళ్ళినందుకు తనపై కూడా దాడి చేశాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆత్మహత్యకు ముందు ప్రియాంక కూడా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. మే పదకొండున ఉన్ని ఇంట్లో గొడవ జరిగిందని, వెంటనే పుట్టింటికి ప్రియాంక ఇంటికి వచ్చేసింది. ఆ మరుసటిరోజే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

మలయాళ నటుడు రాజన్​ పి దేవ్ తెలుగులో విలన్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన `ఆది`, `దిల్​`, `ఒక్కడు`, `ఖుషి`, `గుడుంబా శంకర్​` లాంటి సినిమాల్లో నటించి తెలుగు ఆడియెన్స్ కి దగ్గరయ్యారు. సౌత్‌లో ఆయన 200 సినిమాలకుపైగా నటించారు. 2009లో లివర్​ సంబంధిత వ్యాధితో బాధపడుతూ కన్నుమూశారు. తండ్రి చనిపోయాక జల్సాలకు అలవాటు పడ్డ ఉన్ని, కుటుంబ సభ్యులతో కలిసి డబ్బు కోసమే ప్రియాంకను వేధించినట్లు తెలుస్తోంది. కాగా ఇప్పుడు ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?