Sai Pallavi: పెళ్లికి టైం ఫిక్స్ చేసిన సాయి పల్లవి..

Published : Jan 05, 2022, 07:42 PM IST
Sai Pallavi: పెళ్లికి టైం ఫిక్స్ చేసిన సాయి పల్లవి..

సారాంశం

ప్రస్తుతం శ్యామ్ సింగరాయ్ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు సాయి పల్లవి. అలాగే ప్రమోషన్స్ లో భాగంగా అనేక ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ఇక సాయి పల్లవి పెళ్లి గురించి యాంకర్ అడిగిన ప్రశ్నకు స్పందించారు.

వరుస విజయాలతో దూసుకుపోతోంది నాచురల్ బ్యూటీ సాయి పల్లవి (Sai Pallavi). ఆమె రీసెంట్ చిత్రాలు లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్ హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి. లవ్ స్టోరీ మూవీలో నాగ చైతన్యతో జతకట్టిన సాయి పల్లవి జుంబా డాన్స్ ట్రైనర్ గా అదరగొట్టారు. అలాగే నాగ చైతన్య లవర్ గా,   లైంగిక వేధింపులకు గురైన అమ్మాయిగా నటించి మెప్పించారు. దర్శకుడు శేఖర్ కమ్ముల సాయి పల్లవితో మరోమారు మ్యాజిక్ చేశారు. ఫిదా సినిమాలో 'వచ్చిండే మెల్లా మెల్లగ వచ్చిండే' సాంగ్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ కాంబో.. లవ్ స్టోరీ మూవీలో 'సారంగదరియా' సాంగ్ తో అంతకు మించిన సంచలనాలు నమోదు చేశారు. 

కాగా గత ఏడాది డిసెంబర్ 24 విడుదలైన శ్యామ్ సింగరాయ్ (Shyam Singhroy) సైతం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. పిరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో దేవదాసి పాత్రలో సాయి పల్లవి మెస్మరైజ్ చేశారు. ఆ పాత్రను మరో స్థాయికి తీసుకెళ్లిన సాయి పల్లవి... మూవీ విజయంలో కీలక పాత్ర వహించారు. ప్రస్తుతం శ్యామ్ సింగరాయ్ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు సాయి పల్లవి. అలాగే ప్రమోషన్స్ లో భాగంగా అనేక ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. 

ఇక సాయి పల్లవి పెళ్లి గురించి యాంకర్ అడిగిన ప్రశ్నకు స్పందించారు. నాకు వయసు కేవలం 29 సంవత్సరాలే... 30 ఏళ్ల తర్వాత దీని గురించి ఆలోచిస్తా. ప్రస్తుతానికి పెళ్లి ఆలోచన లేదని సాయి పల్లవి క్లారిటీ ఇచ్చారు. కాబట్టి సాయి పల్లవి థర్టీ ప్లస్ లో పెళ్లి చేసుకుంటారన్న మాట. స్టార్ హీరోయిన్ గా ఫుల్ ఫార్మ్ లో ఉన్న సాయి పల్లవి అప్పుడే పెళ్లి చేసుకోకపోవచ్చు. ఈ జనరేషన్ లో సాయి పల్లవిని పద్దతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా చెప్పుకుంటారు. 

తనకంటూ కొన్ని నియమాలు, నిబద్ధతలు పెట్టుకున్న సాయి పల్లవి వాటిని ఫాలో అవుతారు. రెమ్యూనిరేషన్ కి ఆశపడి ప్రాధాన్యత లేని పాత్రలు చేయరు. స్కిన్ షోకి, బోల్డ్ సన్నివేశాలకు ఆమడ దూరంలో ఉంటారు. ఈ లక్షణాలు సాయి పల్లవిని పరిశ్రమలో మరింత ప్రత్యేకంగా మార్చివేశాయి. ప్రస్తుతం ఆమె తెలుగులో విరాట పర్వం(Virata Parvam) మూవీ చేస్తున్నారు. రానా హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్నారు. రానా నక్సల్ రోల్ చేస్తుండగా, ఆయన ప్రేయసిగా సాయి పల్లవి కనిపించనుంది. ఈ మూవీలో ప్రియమణి మరో కీలక రోల్ చేస్తున్నారు. చాలా కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ విడుదల ఆలస్యమైంది. 

Also read మహేష్‌ రష్మికని మర్చిపోయాడా? లేక కావాలని వదిలేశాడా? పేరు మిస్సింగ్‌పై ట్రోలింగ్‌

అలాగే సాయి పల్లవి మరో తమిళ చిత్రం చేస్తున్నారు. కాగా సాయి పల్లవి చెల్లెలు పూజా కన్నన్ వెండితెరకు పరిచయమయ్యారు. ఆమె నటించిన తమిళ చిత్రం ''చిత్తిరై సవ్వానమ్'' ఓటిటిలో విడుదలైంది. ఈ మూవీ జీ 5లో అందుబాటులోకి వచ్చింది. ఇక తన చెల్లెలిని నటిగా ఆదరించాలని సాయి పల్లవి సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ నోట్ షేర్ చేశారు. 

Also read Rakul Preeth singh:ప్రియుడుతో పాటు కెమెరా కంటికి చిక్కిన రకుల్.. సెలెబ్రేషన్స్ ముగించుకొని వస్తూ...

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Panchali Panchabhartruka: క్విక్‌ గన్‌ మురుగన్‌గా రాజేంద్రప్రసాద్‌.. `పాంచాలి పంచభర్తృక`లో నటకిరీటి రచ్చ
Pooja Hegde: బాలీవుడ్ కి వెళితే ఎవరైనా ఇలా మారిపోవలసిందేనా.. సోషల్ మీడియా మొత్తం పూజా హెగ్డే గురించే..