సినిమా టికెట్ ధరల వివాదం.. మిగిలినోళ్ల సంగతి నాకెందుకు, నాకైతే ఇబ్బందిలేదు: నాగార్జున సంచలనం

Siva Kodati |  
Published : Jan 05, 2022, 07:19 PM ISTUpdated : Jan 05, 2022, 07:26 PM IST
సినిమా టికెట్ ధరల వివాదం.. మిగిలినోళ్ల సంగతి నాకెందుకు, నాకైతే ఇబ్బందిలేదు: నాగార్జున సంచలనం

సారాంశం

ఏపీలో సినిమా టికెట్ల (movie ticket rates issue) వ్యవహారంపై స్పందించారు అగ్ర కథానాయకుడు నాగార్జున (nagarjuna). టికెట్ల రేట్లు ఎక్కువ వుంటే కాస్త ఎక్కువ డబ్బులు వస్తాయని మిగిలిన వారి సంగతి తనకు తెలియదని తనకైతే ఇబ్బంది లేదని చెప్పుకొచ్చారు నాగార్జున. ఏపీలో టికెట్ల రేట్లతో తాను సంతోషంగానే వున్నానని... సినిమా టికెట్ల ధరలు పెరిగితే మంచిదేని ఆయన చెప్పారు

ఏపీలో సినిమా టికెట్ల (movie ticket rates issue) వ్యవహారంపై స్పందించారు అగ్ర కథానాయకుడు నాగార్జున (nagarjuna) . ప్రస్తుతం బంగార్రాజు (bangarraju) మూవీ విడుదల సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతమున్న సినిమా టికెట్ల ధరల వ్యత్యాసాల వల్ల ఇబ్బందులు ఏమైనా వున్నాయా అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు అలాంటిదేమి లేదని సమాధానం ఇచ్చారు నాగ్. అలాగే టికెట్ల రేట్లు ఎక్కువ వుంటే కాస్త ఎక్కువ డబ్బులు వస్తాయని మిగిలిన వారి సంగతి తనకు తెలియదని తనకైతే ఇబ్బంది లేదని చెప్పుకొచ్చారు నాగార్జున. ఏపీలో టికెట్ల రేట్లతో తాను సంతోషంగానే వున్నానని... సినిమా టికెట్ల ధరలు పెరిగితే మంచిదేని ఆయన చెప్పారు. బంగార్రాజు సినిమాను ప్యాకెట్‌లో పెట్టుకొని ఉంచలేమని.. తన సినిమాకు ఎలాంటి సమస్యా లేదని నాగార్జున పేర్కొన్నారు. 

కాగా.. అక్కినేని నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించిన ‘బంగార్రాజు’ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేస్తున్నట్టు చిత్ర బృందం తాజాగా ప్రకటించింది. ప్రస్తుత కోవిడ్ పరిస్ధితుల నేపథ్యంలో ఈ మూవీ విడుదల వుంటుందా వుండదా అన్న అనుమానాలకు చిత్ర బృందం ప్రెస్‌మీట్‌ నిర్వహించి క్లారిటీ ఇచ్చింది.  ఈ మేరకు ‘బంగారా’ అనే పాటకు సంబంధించిన ప్రోమోను విడుదల చేసింది.  

నాగార్జున, రమ్యకృష్ణ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ చిత్రానికి ప్రీక్వెల్‌గా ‘బంగార్రాజు’ రూపొందింది. కల్యాణ్‌కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. రమ్యకృష్ణ, కృతిశెట్టి హీరోయిన్లు. మరోసారి నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించటం, ‘సోగ్గాడే..’కి ప్రీక్వెల్‌ కావటంతో ‘బంగార్రాజు’ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలున్నాయి. మరోవైపు, ఇదే రోజున విడుదలకావాల్సిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ ‘రాధేశ్యామ్‌’ సినిమా వాయిదా పడిన సంగతి తెలిసిందే.  

నిజానికి `ఆర్‌ఆర్‌ఆర్‌` వాయిదా టైమ్‌లోనే `రాధేశ్యామ్‌`(Radheshyam Postponed) కూడా వాయిదా పడుతుందనే వార్తలు వచ్చాయి. కానీ అందులో నిజం లేదని, వాయిదాపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, అనుకున్న డేట్‌కే రిలీజ్‌ ఉంటుందని వెల్లడించింది యూనిట్‌. కానీ నిన్న ఒక్కరోజే తెలంగాణలోనూ భారీగా కేసులు పెరిగాయి. కరోనా ఆంక్షలు రాబోతున్నాయి. దీంతో తప్పని పరిస్థితుల్లో `రాధేశ్యామ్‌`ని వాయిదా వేస్తున్నట్టు యూనిట్‌ వెల్లడించింది. 

ALso Read:Varma vs Perni Nani: వర్మ-పేర్ని నాని మధ్య కుదిరిన సంధి.. త్వరలో కలుద్దాం అంటూ ట్వీట్స్

`సినిమాని విడుదల చేయడానికి సంబంధించి గత కొన్ని రోజులుగా మేం చాలా ప్రయత్నించాం. కానీ కరోనా కేసులు, ఒమిక్రాన్‌ వేరియంట్‌ మరింతగా పెరుగుతున్నాయి. దీంతో వెనక్కి తగ్గాల్సి వచ్చిందని, సినిమాని బిగ్‌ స్క్రీన్‌పై కి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం. రాధేశ్యామ్‌ స్టోరీనే ప్రేమ, విధి మధ్య పోటీగా సాగుతుంది. అలాగే మీడి ప్రేమతో ఈ గడ్డు పరిస్థితులను ఎదుర్కొని తిరిగి వస్తాం` అని వెల్లడించింది యూనిట్‌. త్వరలోనే సినిమాని తెరపైకి తీసుకొస్తామని తెలిపింది. 

ప్రభాస్‌ హీరోగా పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న `రాధేశ్యామ్‌` చిత్రానికి రాధాకృష్ణ కుమార్‌ దర్శఖత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్‌ పతాకాలపై వంశీ, ప్రమోద్‌, ప్రసీద నిర్మిస్తున్నారు. కృష్ణంరాజు సినిమాకి సమర్పకులుగా వ్యవహరించడంతోపాటు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని పాన్‌ ఇండియా లెవల్లో విడుదల చేయడానికి ప్లాన్‌ చేశారు. 
 

PREV
click me!

Recommended Stories

Thanuja: దిమ్మ తిరిగే ట్విస్ట్, తనూజకి ఫైనలిస్ట్ గా నో ఛాన్స్.. నేనూ మనిషినే, ఇమ్మాన్యుయేల్ ఎమోషనల్
Vahini Battles Cancer : విషమంగా సీనియర్ నటి ఆరోగ్య పరిస్థితి, సహాయం కోసం ఎదురుచూపులు